చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. 44 పరుగుల తేడాతో సీఎస్కేను ఓడించి లీగ్‌లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన దిల్లీ 176 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది. ఛేదనలో సీఎస్కే ఆటగాళ్లు డుప్లెసిస్(43) మినహా.. మిగిలిన వారంతా విఫలమయ్యారు. దిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జ్ రెండు వికెట్లు పడగొట్టగా.. రబాడా, అక్షర్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ధోనీ సేనపై దిల్లీ అద్భుత విజయం - csk vs dc
22:56 September 25
22:47 September 25
డుప్లెసిస్(43) ఔట్ అయ్యాడు. చెన్నై ఇంకా 16 బంతుల్లో 63 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ధోనీ కొనసాగుతున్నాడు.
22:38 September 25
చెన్నై మరో వికెట్ కోల్పోయింది. అన్రిచ్ నోర్ట్జ్ బౌలింగ్‌లో జాదవ్(26) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. చెన్నై ఇంకా 26 బంతుల్లో 78 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ధోనీ, డుప్లెసిస్ ఉన్నారు.
22:27 September 25
డుప్లెసిస్(33), కేదార్ జాదవ్(20) నిలకడగా ఆడుతూ.. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. చెన్నై ఇంకా 36 బంతుల్లో92 పరుగులు చేయాల్సి ఉంది.
21:57 September 25
చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రుతురాజ్(5) రనౌట్ అయ్యాడు. 10 ఓవర్ల సమయానికి చెన్నై స్కోరు 47/3. ఇంకా 60 బంతుల్లో 129 పరుగులు చేయాల్సి ఉంది.
21:52 September 25
చెన్నై రెండో వికెట్‌గా మురళీ విజయ్(10) వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్, రుతురాజ్ ఉన్నారు. 7 ఓవర్లకు 37 పరుగులు చేసింది ధోనీసేన.
21:42 September 25
చెన్నై జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన వాట్సన్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం 5 ఓవర్లకు 26 పరుగులు చేసింది ధోనీసేన. విజయానికి 90 బంతుల్లో 150 పరుగులు కావాలి.
21:34 September 25
176 పరుగుల లక్ష్య ఛేదనను చెన్నై ప్రారంభించింది. నాలుగు ఓవర్లు పూరయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో వాట్సన్, మురళీ విజయ్ ఉన్నారు.
21:06 September 25
చెన్నై లక్ష్యం 176 పరుగులు
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పృథ్వీ షా(64), ధావన్(35), రిషభ్ పంత్(37).. జట్టు స్కోరును పరుగులు పెట్టించడంలో కీలకపాత్ర పోషించారు. చెన్నై బౌలర్లలో చావ్లా రెండు వికెట్లు సొంతం చేసుకోగా.. సామ్ కరన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
21:06 September 25
దిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. సామ్ కరన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(26) అవుట్ అయ్యాడు. 19.2 ఓవర్ల సమయానికి దిల్లీ స్కోరు 165/3.
20:51 September 25
17 ఓవర్లు ముగిసే సరికి దిల్లీ స్కోరు146/2. క్రీజులో శ్రేయస్(22), రిషభ్ పంత్(22) ఉన్నారు. ప్రస్తుత రన్‌రేట్ 8.5గా ఉంది.
20:28 September 25
దిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. చావ్లా బౌలింగ్‌లో పృథ్వీ(64) స్టంప్ అవుట్ అయ్యాడు. 13 ఓవర్ల సమయానికి దిల్లీ స్కోరు 105/2. ప్రస్తుత రన్‌రేట్ 8.08గా ఉంది.
20:21 September 25
తొలి వికెట్ కోల్పోయిన దిల్లీ. చావ్లా బౌలింగ్‌లో ధావన్(35) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 11 ఓవర్ల సమయానికి దిల్లీ స్కోరు 94/1
20:17 September 25
పృథ్వీ షా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒపెనర్‌గా దిగి 35 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 10 ఓవర్లు ముగిసే సరికి దిల్లీ స్కోరు 88/0. ప్రస్తుత రన్‌రేట్ 8.8గా ఉంది.
19:51 September 25
ఓపెనర్లుగా దిగిన పృథ్వీ షా(25), శిఖర్ ధావన్(3) నిలకడగా ఆడుతూ.. మెల్లగా స్కోరును పరుగులుపెట్టిస్తున్నారు. ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి దిల్లీ క్యాపిటల్స్ స్కోరు 30/0.
19:34 September 25
తొలి ఓవర్ ముగిసేసరికి దిల్లీ జట్టు వికెట్లేమి నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో పృథ్వీ షా, శిఖర్ ధావన్ ఉన్నారు.
19:09 September 25
జట్ల వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్: మురళీ విజయ్, షేన్ వాట్సన్, డుప్లెసిస్, సామ్ కరన్, రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్, ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జోష్ హేజిల్‌వుడ్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా
దిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, హెట్మయిర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్ పంత్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రబాడా, అమిత్ మిశ్రా, అన్రిచ్ నోర్ట్జ్, అవేశ్ ఖాన్
ఇప్పటి వరకు ఇరు జట్లు కలిసి 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వాటిలో చెన్నై 15 సార్లు గెలవగా.. దిల్లీ ఆరింటితో సరిపెట్టుకుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ధోనీ ఇంకా రెండు సిక్సులు కొడితే 300ల జాబితాలో చేరిన మూడో భారతీయ ఆటగాడిగా ఘనత సాధిస్తాడు.
18:59 September 25
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది చెన్నై. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపు సాధించాలని కెప్టెన్ ధోనీ భావిస్తున్నాడు.
18:23 September 25
గెలిచే జట్టేది?
దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగనుంది. భారత కాలకాలమాన ప్రకారం రాత్రి 7:30 గంటలకు మొదలు కానుంది.
తొలి మ్యాచ్‌లో విజయఢంకా మోగించిన చెన్నై.. రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. పంజాబ్‌పై తొలి మ్యాచ్‌లో గెల్చిన దిల్లీ.. పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది. గత మ్యాచ్ ఓటమిలో తమ లోపాలను సరిదిద్దుకుని సీఎస్కే, మరిన్ని వ్యూహాలతో దిల్లీ.. గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్నాయి.