తెలంగాణ

telangana

ETV Bharat / sports

'డివిలియర్స్​ను అందుకే ఆలస్యంగా పంపాం' - bengalure and punjab ipl

ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. గత రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. అదేంటి కోహ్లీ కొట్టింది 48 పరుగులే కదా అనుకుంటున్నారా? అయితే, అక్కడే మీరు తప్పులో కాలేశారు. అతడు డబుల్‌ సెంచరీ చేసింది ఆర్సీబీ టీమ్‌తో. 2008 నుంచీ ఈ మెగా టోర్నీ ఆడుతున్న అతడు గురువారం పంజాబ్‌తో తలపడిన సందర్భంగా బెంగళూరు తరఫున 200వ మ్యాచ్‌ పూర్తి చేసుకున్నాడు.

IPL 2020: Kohli reveals reason behind sending de Villers at No 6
కోహ్లీ@ డబుల్​ సెంచరీ

By

Published : Oct 16, 2020, 11:59 AM IST

2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న విరాట్ కోహ్లీ గురువారం పంజాబ్‌తో తలపడిన సందర్భంగా బెంగళూరు తరఫున 200వ మ్యాచ్‌ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఒకే జట్టు తరఫున ఇన్ని మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు.

ఇప్పటివరకు ఈ లీగ్‌లో 185 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. ఛాంపియన్స్‌ లీగ్‌లోనూ బెంగళూరు తరఫున 15 మ్యాచ్‌లు ఆడాడు. దాంతో ఆ జట్టుతో డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ విషయంపై కోహ్లీ మాట్లాడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో

"బెంగళూరు జట్టంటే నాకెంతో ప్రత్యేకం. ఆ భావోద్వేగాన్ని చాలామంది అర్థం చేసుకోలేరు. ఆ జట్టు తరఫున 200 మ్యాచ్‌లు ఆడానంటే నమ్మలేకపోతున్నా. 2008లో ఈ జట్టులోకి వచ్చినప్పుడు ఇన్ని మ్యాచ్‌లు ఆడతానని ఊహించలేకపోయా. ఇది నాకెంతో గౌరవం. వాళ్లు నన్ను అట్టి పెట్టుకున్నారు. నేనూ అలాగే ఉండిపోయ

-బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.

ఏబీడీ ఆ స్థానంలో రావడానికి కారణం అదే

గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లకు 171/6 స్కోర్‌ చేసింది. అనంతరం పంజాబ్‌ రెండు వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. అయితే, కోహ్లీసేన ఇన్నింగ్స్‌లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌(2) ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి విఫలమవ్వడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.

గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో

ప్రణాళిక సరైందే..కానీ

మ్యాచ్‌ అనంతరం ఈ విషయంపై స్పందించిన కోహ్లీ జట్టు ప్రణాళికలో భాగంగానే అలా చేశామని చెప్పాడు. పంజాబ్‌ టీమ్‌లో ఇద్దరు లెగ్‌స్పిన్నర్లు ఉన్నారని, దాంతో లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌ కోసమే డివిలియర్స్‌ను ఆరో స్థానంలో పంపించినట్లు స్పష్టం చేశాడు. తమ ప్రణాళిక సరైందేనని, కానీ అది ఫలించలేదని పేర్కొన్నాడు.

ఒత్తిడిలో అయోమయం :

అలాగే దూబె, వాషింగ్టన్‌ సుందర్‌లకు కూడా సరైన అవకాశం ఇవ్వడానికి ప్రయత్నించామన్నాడు విరాట్. తాము చేసిన 171 పరుగుల స్కోర్‌ మంచిదేనని, బౌలర్లు కూడా అద్భుతంగా వేశారని మెచ్చుకున్నాడు. అయితే, తాము అనుకున్న విధంగా ఫలితం రాలేదని కోహ్లీ చెప్పాడు. పంజాబ్‌ ఛేదనలో 18 ఓవర్లకే మ్యాచ్‌ పూర్తవుతుందని భావించామని, కానీ అది చివరి వరకూ వెళ్లడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఒత్తిడిలో ఎవరైనా అయోమయానికి గురవుతారని, ఈ టీ20 ఫార్మాట్‌లో ఏదైనా జరుగొచ్చన్నాడు. పంజాబ్‌ మంచి ప్రదర్శన చేసిందని కోహ్లీ ప్రశంసించాడు. ఈ విజయంతో పంజాబ్‌ ప్లేఆఫ్‌ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌(61 నాటౌట్‌), క్రిస్‌గేల్‌(53), మయాంక్‌ అగర్వాల్‌(45) ధాటిగా ఆడారు.

ABOUT THE AUTHOR

...view details