ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ పదమూడో సీజన్ వ్యాఖ్యాతల బృందంలో ఒకడైన కెవిన్ పీటర్సన్ శుక్రవారం తిరిగి లండన్ చేరుకున్నాడు. పిల్లలతో కలిసి సమయం గడపడం కోసమే అతను అర్ధంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కరోనా పరిస్థితుల కారణంగా యూకేలో విద్యాసంస్థల సెలవులు పొడిగించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చెప్పాడు.
"నా పిల్లలకు సెలవులు ఉండడం వల్ల ఐపీఎల్ వదిలేసి ఇంటికి వెళ్తున్నా. వాళ్లతో కలిసి ఇంట్లోనే ఉండాలనుకుంటున్నా. ఇదో వింత ఏడాది. ఇప్పుడు పిల్లలకు పాఠశాల కూడా లేదు. కాబట్టి ప్రతిరోజు వాళ్లతోనే సమయం గడపాలని కోరుకుంటున్నా."