దిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ ప్రారంభంలో వరుసగా రెండేళ్లు ప్లేఆఫ్స్ చేరి అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ ఆ తర్వాత సీజన్లలో అస్థిర ప్రదర్శనతో వెనకబడిపోయింది. మళ్లీ 2012లో ప్లేఆఫ్స్ చేరిన జట్టు తర్వాత ఆరేళ్లు అసలు టాప్-5లోనే కనిపించలేదు. దీంతో వాళ్ల పనైపోయిందనుకున్నారు. గతేడాది దిల్లీ డేర్‌డెవిల్స్ పేరును దిల్లీ క్యాపిటల్స్‌గా మార్చుకుని మరోసారి సత్తాచాటి, మూడో స్థానంతో సరిపెట్టుకుంది. శ్రేయస్ నాయకత్వంలో ఇప్పుడు తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగే తుదిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయితో అమీతుమీ తేల్చుకోనుంది.
దిల్లీ వైపే అదృష్టం!
ఐపీఎల్ జరిగిన ప్రతి లీపు సంవత్సరంలో కొత్త ఛాంపియన్ రావడం విశేషం.
2008 - రాజస్థాన్ రాయల్స్
2012 - కోల్‌కతా నైట్‌రైడర్స్
2016 - సన్‌రైజర్స్ హైదరాబాద్
2020.. ఇదీ లీపు సంవత్సరం కావడం వల్ల ఈసారి దిల్లీ కొత్త ఛాంపియన్‌గా అవతరిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే అత్యంత తక్కువ వయసులో టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా రికార్డు సృష్టిస్తాడు శ్రేయస్ అయ్యర్.
నాకౌట్ స్టేజ్‌లో దిల్లీ ప్రదర్శన
ఆడిన మ్యాచ్‌లు - 8
గెలిచినవి - 2