తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2020, 11:08 AM IST

ETV Bharat / sports

'పరుగులు ఇవ్వకూడదని అనుకున్నా.. ధోనీ మాత్రం'

కోల్​కతా నైట్​ రైడర్స్​ బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయడానికి తనకు యార్కర్లు బాగా ఉపయోగపడినట్లు చెప్పాడు చెన్నైజట్టు ఆల్​రౌండర్​ డ్వేన్​ బ్రావో. ఈ విధమైన బౌలింగ్​ ఎంతో ఉత్తమమైనదని అభిప్రాయపడ్డాడు.

Bravo
డ్వేన్​ బ్రావో

అబుదాబి పిచ్​​ వికెట్లు తీసేందుకు అనుకూలంగా ఉంటుందని చెన్నై సూపర్​కింగ్స్ ఆల్​రౌండర్ బ్రావో చెప్పాడు. తాను వీలైనన్ని పరుగులను నియంత్రించాలని అనుకున్నానని, సారథి ధోనీ మాత్రం వికెట్లు తీయాలని తనతో చెప్పినట్లు తెలిపాడు. అందుకే కోల్​కతా బ్యాట్స్​మెన్​ను కట్టడి చేసేందుకు యార్కర్లు వేసినట్లు వెల్లడించాడు. తనవరకు యార్కర్లు​ ఎంతో ఉత్తమమైనవని అభిప్రాయపడ్డాడు.

డ్వేన్​ బ్రావో

"ఆక్కడి పిచ్​ వికెట్లు పడగొట్టేందుకు అనుకూలం. నెమ్మదైన బంతులు వేస్తానని ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ భావించారు. కానీ నేను మాత్రం యార్కర్​ బౌలింగ్​తో వారిని కట్టడి చేశాను. యార్కర్లు వేయడం ఎంతో సురక్షితం, ఉత్తమమం"

-బ్రావో, సీఎస్కే ఆల్​రౌండర్​.

150 వికెట్ల క్లబ్​లో బ్రావో

కోల్​కతాతో మ్యాచ్​లో మూడు వికెట్లు తీసిన బ్రావో.. ఐపీఎల్​లో 150 వికెట్ల క్లబ్​లో చేరిన రెండో బౌలర్ పేసర్​గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన వారిలో మలింగ(170) తొలి స్థానంలో ఉన్నాడు. స్పిన్నర్లలో పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్ ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నారు.

ఈ మ్యాచ్​లో కోల్​కతా చేతిలో 10 పరుగుల తేడాతో చెన్నై ఓడింది. బౌలర్లు రాణించినా సరే బ్యాట్స్​మెన్ విఫలమయ్యారు.

ఇదీ చూడండి ఐపీఎల్​లో ధోనీ, బ్రావో సరికొత్త రికార్డులు

ABOUT THE AUTHOR

...view details