రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర అంశం కెమెరా కంటికి చిక్కింది. చివరి ఓవర్లో రాహుల్ తెవాతియాకు బౌలింగ్ వేసిన ఆర్సీబీ ఆటగాడు నవదీప్ సైనీ షూస్‌పై కొన్ని పదాలు రాసి ఉండటం కనిపించింది. 'ఎఫ్*** ఇట్.., బౌల్ ఫాస్ట్' అని అతడే స్వయంగా రాసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టంట్లో వైరల్‌గా మారింది.
అయితే ఇలాంటి సంఘటన జరగడం ఇదేం తొలిసారి కాదు. 2019లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఇలాగే చేతి మణికట్టుపై కొన్ని పదాలు రాసుకున్నాడు. అప్పట్లో దీనికి సంబంధించిన ఫొటో బాగా వైరల్ అయింది. కాగా ఇతడు కూడా 2015లో ఆర్సీబీకి ఆడటం మరో విశేషం.