తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎమర్జింగ్​ ప్లేయర్​గా పడిక్కల్​- సూపర్​ స్ట్రైకర్​ పొలార్డ్​

అనూహ్యమైన మలుపులతో.. అభిమానులను ఉర్రూతలూగిస్తూ సాగిన ఐపీఎల్​-2020 అంకం సమాప్తమైంది. ముంబయి ఇండియన్స్​నే మరోసారి ట్రోఫీ వరించింది. లీగ్​లో అత్యధిక పరుగులు చేసిన కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్ ఆరెంజ్​ క్యాప్​ను​ సొంతం చేసుకున్నాడు. పర్పుల్​ క్యాప్​ను రబాడా దక్కించుకున్నాడు. ఈ సీజన్​లో ఇంకా ఎవరెవరు ఏయే అవార్డులు అందుకున్నారో ఓ లుక్కేద్దాం.

IPL 13 padikkal wins emerging player pollard takes super stiker award
ఎమర్జింగ్​ ప్లేయర్​గా పడిక్కల్​- సూపర్​ స్ట్రైకర్​ పొలార్డ్​

By

Published : Nov 11, 2020, 4:40 AM IST

Updated : Nov 11, 2020, 9:09 AM IST

ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్​ పదమూడో సీజన్​ ఘట్టం ముగిసింది. దుబాయ్​ వేదికగా జరిగిన తుది సంగ్రామంలో దిల్లీని చిత్తుచేసి, ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది ముంబయి ఇండియన్స్​ జట్టు. ఈ నేపథ్యంలో వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను అవార్డులతో సత్కరించింది ఐపీఎల్​ యాజమాన్యం.

కేఎల్​ రాహుల్ (ఆరెంజ్​ క్యాప్.. గేమ్​ ఛేంజర్​)​

సీజన్​లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి అందించే ఆరెంజ్​ క్యాప్​ను పంజాబ్​ సారథి కేఎల్​ రాహుల్​ సొంతం చేసుకున్నాడు. 670 పరుగులతో సీజన్​లో టాప్​స్కోరర్​గా నిలిచాడు రాహుల్​. అనూహ్యమైన తన ఇన్నింగ్స్​ల​తో ఎన్నోసార్లు మ్యాచ్​ రూపు రేఖలను మార్చేసినందుకు గాను.. గేమ్​ ఛేంజర్​ ఆఫ్​ ది సీజన్​ అవార్డునూ అందుకున్నాడు.

పర్పుల్​ క్యాప్​.. రబాడా

లీగ్​లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇచ్చే పర్పుల్​ క్యాప్​ను రబాడా(దిల్లీ క్యాపిటల్స్​) దక్కించుకున్నాడు. ఐపీఎల్​-13లో ఈ సౌతాఫ్రికా బౌలర్​ మొత్తం 30 వికెట్లు తీశాడు.

రబాడా

ఎమర్జింగ్​ ప్లేయర్​.. పడిక్కల్​

ఐపీఎల్​లో ఈసారి ఆర్​సీబీ ఆటగాడు దేవ్​దత్​ పడిక్కల్​కు ఎమర్జింగ్​ ప్లేయర్ అవార్డు వరించింది. ఈ సీజన్​లో 15 మ్యాచ్​లు ఆడిన ఇతడు.. 473 పరుగుల్ని సాధించాడు. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఆరోస్థానంలో నిలిచాడు.

పడిక్కల్​

అత్యధిక సిక్సులతో.. ఇషాన్​ కిషన్​

ముంబయి ఇండియన్స్​ తరఫున పదమూడు మ్యాచ్​లు ఆడిన ఇషాన్​ కిషన్​ ఈసారి ఐపీఎల్​లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 516 పరుగులు చేయగా.. అందులో 30 సిక్సర్లు ఉన్నాయి.

ఇషాన్​ కిషన్​

సూపర్​స్ట్రైకర్​గా పొలార్డ్​..

ఈ సీజన్​లో అన్ని మ్యాచ్​ల్లో కలిపి అత్యధిక స్ట్రైక్​ రేట్​(191.43) సాధించిన ఆటగాడిగా నిలిచాడు ముంబయి జట్టు హిట్టర్​ పొలార్డ్​. రోహిత్​ శర్మ తొడ కండర గాయంతో కొన్ని మ్యాచ్​లకు దూరమవగా.. ముంబయి ఇండియన్స్​ సారథ్య బాధ్యతలను భుజానికెత్తుకున్నాడు పొలార్డ్​.

ఫెయిర్​ ప్లే అవార్డు ముంబయికే..

క్రీడాస్ఫూర్తిని కనబర్చినందుకు అందించే ఫెయిర్​ ప్లే అవార్డును ఐపీఎల్​ 2020 విజేత ముంబయి ఇండియన్స్​ కైవసం చేసుకుంది. ముంబయి సారథి రోహిత్​ శర్మ ఈ అవార్డును అందుకున్నాడు.

పవర్​ ప్లేయర్​ ఆఫ్​ ది సీజన్​.. బౌల్ట్​

ముంబయి ఇండియన్స్​ ఆల్​రౌండర్​ ట్రెంట్​ బౌల్ట్..​ ఈ ఐపీఎల్​ సీజన్​లో పవర్​ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా​ నిలిచాడు.

మోస్ట్​ వాల్యేబుల్​(అత్యంత విలువైన ఆటగాడు)​ ప్లేయర్​..

ఆర్చర్​

రాజస్థాన్​ రాయల్స్​ తరఫున 10 మ్యాచ్​లు ఆడిన ఆర్చర్​.. ఈ సీజన్​లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు. 20 వికెట్లు తీయడమే కాక.. కీలక సమయాల్లో పరుగులనూ రాబట్టాడు.

ఇదీ చూడండి:ఐపీఎల్​: మురిసిన ముంబయి.. ఐదో టైటిల్ కైవసం

Last Updated : Nov 11, 2020, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details