తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయి పాంచ్​ పటాకా.. ఐదోసారి విజేతగా రోహిత్​సేన

MI won the toss and elected to bat first
టాస్ గెలిచిన దిల్లీ.. ముంబయి బ్యాటింగ్

By

Published : Nov 10, 2020, 7:02 PM IST

Updated : Nov 10, 2020, 11:00 PM IST

22:53 November 10

ముంబయిదే గెలుపు

పదమూడో సీజన్‌ లీగ్‌ విజేతగా ముంబయి నిలిచింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ముంబయి అయిదో టైటిల్‌ సాధించింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో దిల్లీని అయిదు వికెట్ల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (65*), పంత్ (56) రాణించారు. ఆ జట్టును బౌల్ట్‌ (3/30) దెబ్బతీశాడు. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 18.4 ఓవర్లలోనే అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్‌ శర్మ (68) అర్ధశతకంతో చెలరేగాడు.

22:41 November 10

రోహిత్ ఔట్

కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 68 పరుగులు చేసి ఔటయ్యాడు. భారీ షాట్​ ఆడబోయి క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 17 ఓవర్లకు 147 పరుగులు చేసింది దిల్లీ. విజయం కోసం ఇంకా 18 బంతుల్లో 10 పరుగులు చేయాలి.

22:18 November 10

రోహిత్ హాఫ్ సెంచరీ

ముంబయి సారథి రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో అర్ధశతకం చేశాడు. ప్రస్తుతం ముంబయి 12 ఓవర్లకు 102 పరుగులు చేసింది.

22:11 November 10

దూకుడుగానే ముంబయి

ముంబయి దూకుడు కొనసాగిస్తోంది. సూర్య కుమార్ 19 పరుగులు చేసి రనౌటయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లు పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది ముంబయి. రోహిత్ 47 పరుగులతో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.

21:43 November 10

జోరు మీద ముంబయి

దూకుడు కొనసాగిస్తోంది ముంబయి. ఓపెనర్లు రోహిత్ (21), డికాక్ (20) జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లకు 45 పరుగులు చేసింది ముంబయి.

21:34 November 10

దూకుడుగా ముంబయి

157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. మొదటి ఓవర్లో 8 పరుగులు చేసింది. రోహిత్ (7), డికాక్ (1) క్రీజులో ఉన్నారు. 

21:16 November 10

ముంబయి లక్ష్యం 157

ఐపీఎల్ ఫైనల్లో ముంబయి ఇండియన్స్ ముందు 157 పరుగుల లక్ష్యాన్ని ఉంచించి దిల్లీ క్యాపిటల్స్. శ్రేయస్ అయ్యర్ (65) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. పంత్ (56) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ధావన్ (15), స్టోయినిస్ (0), రహానే (2, హెట్​మెయర్ (5) పూర్తిగా విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో బౌల్ట్ 3 వికెట్లతో రాణిెంచగా.. కౌల్టర్​నీల్ 2, జయంత్ యాదవ్ 1 వికెట్ దక్కించుకున్నారు. 

21:02 November 10

దూకుడుగానే దిల్లీ

జోరు కొనసాగిస్తోంది దిల్లీ క్యాపిటల్స్. వికెట్లు పడుతున్నా దూకుడుగా పరుగులు సాధిస్తోంది. ప్రస్తుతం 18 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. పంత్ (56) అద్భుత అర్ధశతకం చేసి ఔటైనా.. కెప్టెన్ శ్రేయస్ (56) దూకుడుగా ఆడుతున్నాడు.

20:38 November 10

దూకుడుగా దిల్లీ

దూకుడు పెంచింది దిల్లీ క్యాపిటల్స్. పంత్ (48), శ్రేయస్ (41) జోరుగా పరుగులు  సాధిస్తున్నారు. ప్రస్తుతం 14 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది దిల్లీ. 

20:15 November 10

నెమ్మదిగా ఆడుతోన్న దిల్లీ

ముంబయి బౌలర్లు అదరగొడుతున్నారు. దీంతో ప్రస్తుతం 9 ఓవర్లకు 59 పరుగులు చేసింది దిల్లీ. పంత్ (18), శ్రేయస్ (25) క్రీజులో ఉన్నారు.

19:51 November 10

ధావన్ ఔట్

ముంబయి బౌలర్లు చెలరేగిపోతున్నారు. దిల్లీ బ్యాట్స్​మెన్​ను కట్టడి చేస్తున్నారు. పవర్ ప్లేలో స్పిన్నర్ జయంత్ యాదవ్​కు బాల్ అప్పగించాడు కెప్టెన్ రోహిత్. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ వేసిన తొలి ఓవర్లోనే స్టార్ ఓపెనర్ ధావన్​ (15)ను ఔట్ చేశాడు జయంత్. ప్రస్తుతం 4 ఓవర్లకు 25 పరుగులు చేసింది దిల్లీ.

19:47 November 10

రహానే ఔట్ 

వేసిన రెండో ఓవర్లో మరో వికెట్ దక్కించుకున్నాడు బౌల్ట్. సీనియర్ బ్యాట్స్​మన్ రహానే 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం మూడు ఓవర్లకు 20 పరుగులు చేసింది దిల్లీ.

19:32 November 10

స్టోయినిస్ ఔట్

ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది దిల్లీ. స్టార్ ఆల్​రౌండర్ స్టోయినిస్ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. బౌల్డ్ అద్భుత బంతితో అతడిని బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం మొదటి ఓవర్లో 5 పరుగులు చేసింది దిల్లీ. ధావన్ (4), రహానె (1) క్రీజులో ఉన్నారు. 

19:11 November 10

ఫైనల్​ కోసం ముంబయి ఇండియన్స్ జట్టులో ఓ మార్పు చేసింది. రాహుల్ చాహర్ స్థానంలో జయంత్ యాదవ్​ను తీసుకుంది. దిల్లీ పాత జట్టుతోనే బరిలో దిగనుంది.  

జట్లు

ముంబయి ఇండియన్స్

క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నీల్, జయంత్ యాదవ్, బౌల్ట్, బుమ్రా

దిల్లీ క్యాపిటల్స్

స్టోయినిస్, ధావన్, రహానే, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), హెట్​మెయర్, పంత్, అక్షర్ పటేల్, రవి అశ్విన్, రబాడ, ప్రవీణ్ దూబే, ఎన్రిచ్ నోకియా

18:26 November 10

దిల్లీ బ్యాటింగ్

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్​ తుది​పోరుకు అంతా సిద్ధమైంది. అత్యధికంగా నాలుగు సార్లు ట్రోఫీని అందుకున్న ముంబయి ఇండియన్స్​.. తొలిసారి ఫైనల్స్​కు చేరిన దిల్లీ క్యాపిటల్స్​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కప్​ నీదా నాదా అంటూ సాగే ఈ సమరంలో గెలవాలని ఇరుజట్లు పట్టుదలతో బరిలో దిగనున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత టాస్ గెలిచిన దిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది.

Last Updated : Nov 10, 2020, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details