తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​: ఆగ్రహాలు, అనుబంధాల సమాహారం - shane watson

మైదానంలో ప్రత్యర్థులు. ఎదుటివారిని చిత్తు చేయడమే లక్ష్యంగా పనిచేస్తారు. మధ్యలో ఎన్నో గొడవలు. మ్యాచ్​ ముగిశాక మాత్రం అంతా స్నేహితులే. ఇలాంటి సన్నివేశం ఐపీఎల్​లో మరోమారు కనిపించింది.

ఐపీఎల్​లో మరో వార్​..దూషించుకున్న ఇషాంత్​,వాట్సన్ ​

By

Published : Mar 27, 2019, 2:13 PM IST

చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు ఛేదన ప్రారంభించింది. మూడో ఓవర్ వేస్తున్న ఇషాంత్​.. అంబటి రాయుడి వికెట్​ తీశాడు. ఆ సమయంలో దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాళ్లను చూస్తూ వాట్సన్​ దూషించాడు. దిల్లీ జట్టు ఆటగాడు ఇషాంత్​ శర్మ వాట్సన్​ తో తగువుకు దిగగా.. జోక్యం చేసుకున్న క్యాపిటల్స్ కెప్టెన్​ శ్రేయాస్​ అయ్యర్.. ఇషాంత్​ను అడ్డుకున్నాడు. శర్మ కోపాన్ని చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయాడు వాట్సన్​.

  • కొంత సేపటికి ఆరో ఓవర్​లో రబాడా, వాట్సన్​లు గొడవకు దిగారు. పక్కనే ఉన్న అంపైర్​ వారిద్దరినీ వారించి సద్దుమణిగేలా చేశాడు.

ఈ మ్యాచ్​లో వాట్సన్​ 26 బంతుల్లో 44 పరుగులు( నాలుగు ఫోర్లు, మూడు సిక్సులు) చేసి మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అందుకున్నాడు. అయితే మ్యాచ్​ అనంతరం దిల్లీ కోచ్​ పాంటింగ్​ ప్లేయర్ల మధ్య సామరస్యం నెలకొల్పాడు. ఎన్ని జరిగినా చివరకు ఇలా కలుసుకుంటారంటూ వాళ్లంతా మ్యాచ్​ తరవాత తీసిన వీడియోను షేర్​ చేసింది ఐపీఎల్​ యాజమాన్యం.

ABOUT THE AUTHOR

...view details