తెలంగాణ

telangana

ETV Bharat / sports

పరువు కోసం బెంగళూరు.. ఆశతో రాజస్థాన్​ - IPL

పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానాల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు​ జట్లు నేడు తలపడనున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది.

ప్లే ఆఫ్ కష్టమైనా... పట్టువదలని రాయల్స్​!

By

Published : Apr 30, 2019, 6:01 AM IST

Updated : Apr 30, 2019, 4:31 PM IST

గత నాలుగు మ్యాచ్​ల్లో మూడింటిలో గెలిచి జోరు మీదుంది రాజస్థాన్ రాయల్స్. దిల్లీతో జరిగిన మ్యాచ్​లో ఓడిపోయి ప్లే ఆఫ్​ ఆశలపై నీళ్లు చల్లుకుంది బెంగళూరు. ఈ రెండింటి మధ్య నేడు మ్యాచ్​ జరగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్​ జరగనుంది. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.

12 మ్యాచ్​లాడిన రాజస్థాన్​ ఐదింటిలో నెగ్గి పాయిట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్​కు దాదాపు దూరమైనప్పటికీ అదృష్టం కలిసొస్తే రాజస్థాన్​కు టాప్​-4లో నిలిచే అవకాశముంది. దిల్లీతో గత మ్యాచ్​లో ఓడిపోయిన బెంగళూరు ప్లేఆఫ్​ పోటీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్​లో నెగ్గి పరువు దక్కించుకోవాలనుకుంటోంది.

రాజస్థాన్​ రాయల్స్​..

ఈ మ్యాచ్​ అనంతరం స్టీవ్​స్మిత్​ ప్రపంచకప్​ దృష్ట్యా స్వదేశానికి వెళ్లనున్నాడు. ఎలాగైన ఈ మ్యాచ్​లో గెలిచి జట్టుకు విజయాన్నందించి వీడ్కోలు పలకాలనుకుంటున్నాడు. ఈ మ్యాచ్​కు జోఫ్రా ఆర్చర్​, బెన్ స్టోక్స్ దూరమయ్యే అవకాశం కూడా ఉంది. రాజస్థాన్​పై ఎక్కువ ఒత్తిడి పడనుంది. ఇప్పటికే ఇంగ్లండ్​ ప్రపంచకప్ జట్టుతో కలిశాడుబట్లర్​. కోల్​కతాపై జరిగిన మ్యాచ్​లో రియాన్ పరాగ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. బౌలింగ్​లో శ్రేయాస్ గోపాల్ రాజస్థాన్​కు ప్రధాన అస్త్రం. బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో తన గూగ్లీలతో విరాట్ కోహ్లీ, డివిలియర్స్, హిట్మైర్​​ లాంటి బ్యాట్స్​మెన్​నే పెవిలియన్​కు పంపాడు. సంజూ సాంసన్​, అజింక్య రహానేలు నిలకడగా రాణిస్తున్నారు.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు..

దిల్లీపై ఓడిన బెంగళూరు ప్లే ఆఫ్​ ఆశలపై నీళ్లు చల్లుకుంది. ఇప్పటికే 12 మ్యాచ్​ లాడిన ఆర్​సీబీ నాలుగింట మినహా మిగతా మ్యాచ్​లన్నింటిలో పరాజయం చెందింది. మిగిలిన రెండు మ్యాచ్​లో విజయం సాధించి సీజన్​ను ముగిద్దామనుకుంటోంది బెంగళూరు. కోహ్లీ, డివిలియర్స్​, పార్ధివ్​​ పటేల్​ బ్యాటింగ్​లో అదరగొడుతున్నారు. బౌలింగ్​లో చాహల్, నవదీప్​ సైనీ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు.

జట్లు (అంచనా)

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు

విరాట్​ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్, డివిలియర్స్, ఉమేష్ యాదవ్, మొయిన్ అలీ, చాహల్, అక్షదీప్ నాథ్, స్టోయినిస్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే

రాజస్థాన్​ రాయల్స్​

అజింక్య రహానే, స్టీవ్ స్మిత్(కెప్టెన్), థామస్, లివింగ్ స్టోన్, సంజూ శాంసన్, స్టువర్ట్ బిన్ని, శ్రేయాస్ గోపాల్, ఉనద్కత్, రియాన్ పరాగ్, ధవల్ కులకర్ణి, వరుణ్ ఆరోన్

Last Updated : Apr 30, 2019, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details