పంజాబ్‌తో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గాయం కారణంగా ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేదు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబయి అద్భుత విజయం సాధించింది. ప్రాథమిక పరీక్షల నిమిత్తమే రోహిత్ మ్యాచుకు గైర్హాజరయ్యాడని... తర్వాతి మ్యాచ్‌కు జట్టులోకి వస్తాడని సహచర ఆటగాడైన పొలార్డ్ తెలిపాడు.
పంజాబ్‌తో మ్యాచ్ కోసం ప్రాక్టీసు చేస్తుండగా రోహిత్ శర్మ కాలి కండరాలు పట్టేశాయి. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఓ మ్యాచ్ ఆడలేకపోయాడీ బ్యాట్స్‌మెన్.