తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​ మ్యాచ్​ ఫీజులో 15 శాతం కోత - fee

ముంబయి కెప్టెన్ రోహిత్​ శర్మ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది ఐపీఎల్. అంపైర్​ ఎల్బీ ఇచ్చిన తర్వాత ఆవేశంతో స్టంప్స్​ను కొట్టినందుకు ఫైన్ వేసింది.

రోహిత్

By

Published : Apr 29, 2019, 11:22 AM IST

రోహిత్ శర్మకు మళ్లీ జరిమానా విధించింది ఐపీఎల్. కాకపోతే ఈ సారి స్లో ఓవర్​ రేట్​ కారణంగా కాదు.. ఆవేశంతో స్టంప్స్​ను కొట్టినందుకు. కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో అంపైర్ ఔట్ ఇచ్చిన తర్వాత స్టంప్స్​ను బ్యాట్​తో బాదాడు. ఇందుకుగాను రోహిత్​ శర్మ మ్యాచ్​ పీజులో 15 శాతం కోత విధించింది. ఐపీఎల్ నిబంధనలను అతిక్రమించినందుకు ఈ శిక్ష వేసింది.

స్టంప్స్​ను బ్యాట్​తో కొట్టిన రోహిత్

ఆదివారం ఈడెన్​గార్డెన్స్​ వేదికగా కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో అంపైర్​ ఎల్బీ ఇవ్వడంపై అసంతృప్తి చెందాడు రోహిత్. ఔట్​ను తట్టుకోలేని ఈ ముంబయి బ్యాట్స్​మెన్​ కోపంతో నాన్​స్ట్రైకింగ్​ ఎండ్​లోని స్టంప్స్​ను బ్యాట్​తో కొట్టాడు. రోహిత్​ డీఆర్​ఎస్​ను ఉపయోగించుకున్నా ఫలితం లేకపోయింది.

స్లో ఓవర్​ రేట్​ కారణంగా గతంలోనూ రోహిత్​కు 12 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్. ఈ మ్యాచ్​లో 233 లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది ముంబయి జట్టు. 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. హార్ధిక్ పాండ్య(91, 34 బంతుల్లో) ఒంటరి పోరాటం చేసినా.. జట్టును గెలిపించలేకపోయాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details