తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ వీరోచిత శతకం​...కోల్​కతా లక్ష్యం 214

ఈడెన్ గార్డెన్స్​​ వేదికగా  కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాయల్​ ఛాలెంజర్స్​​ బ్యాట్స్​మెన్లు విరాట్‌ కోహ్లీ, మొయిన్‌ అలీ చెలరేగి ఆడారు.

కోహ్లీ వీరోచిత శతకం​...కోల్​కతా లక్ష్యం 214

By

Published : Apr 19, 2019, 10:07 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. కోహ్లీ శతకంతో అదరగొట్టాడు.

ఈడెన్​లో బౌండరీల వర్షం...

ఆరంభంలో ఓపెనర్‌ పార్థివ్‌పటేల్‌ (11) , అక్ష్‌దీప్‌నాథ్‌ (13) పరుగులకే ఔటయ్యారు. అనంతరం మొయిన్​ అలీ.. కోహ్లీతో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
బౌండరీల మోత మొదలెట్టిన మొయిన్‌ అలీ భారీ స్కోరు సాధించాడు. 28 బంతుల్లోనే 5ఫోర్లు, 6సిక్సర్లతో 66 పరుగులు చేశాడు.

చివరి 7 ఓవర్లలో 115 పరుగులు పిండుకున్నారు బెంగళూరు బ్యాట్స్​మెన్లు. ఐపీఎల్​లో కోహ్లీ ఐదో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. చివరి బంతికి ఔటైన కోహ్లీ (100; 58 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సులు) పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన స్టాయినిస్​ (17; 8 బంతుల్లో) దూకుడుగా ఆడాడు.

చెదిరిన బౌలింగ్​ లైనప్​...

కోహ్లీ, అలీ బ్యాటింగ్​కు కోల్​కతా బ్యాటింగ్​, ఫీల్డింగ్​ లైనప్​ గతి తప్పింది. రైడర్స్​ బౌలర్లలో కుల్దీప్​ 4 ఓవర్లలో 59 పరుగులు సమర్పించుకొని... ఐపీఎల్​లో అత్యధిక పరుగులు ఇచ్చిన కేకేఆర్​ బౌలర్​గా రికార్డు సృష్టించాడు. కేకేఆర్​ బౌలర్లలో గుర్నే, నరైన్​, రస్సెల్​, కుల్దీప్​ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. నరైన్​, రస్సెల్​ మినహా అందరూ 10 ఎకానమీతో పరుగులు ఇచ్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details