ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నైను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది పంజాబ్. ఈ గెలుపుపై ఆనందం వ్యక్తం చేసిన అశ్విన్.. ఈ సీజన్లో కింగ్స్ జట్టు ప్లేఆఫ్‌కు ఎందుకు వెళ్లలేకపోయిందో చెప్పాడు.
'మేం ప్లేఆఫ్‌కు వెళ్లకపోవడానికి కారణమిదే'
ప్రస్తుత ఐపీఎల్లో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచి సీజన్ ముగించింది పంజాబ్. జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేకపోవడంపై స్పందించాడు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్.
'మేం ప్లేఆఫ్‌కు వెళ్లకపోవడానికి కారణమిదే'
"సీజన్ చివరి మ్యాచ్‌లలో మా ప్రదర్శన నన్ను కొంత మేర నిరుత్సాహపరిచింది. మా శక్తి సామర్ధ్యాల మేరకు రాణించలేకపోయాం. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాం. ముఖ్యంగా ఈ సీజన్లో పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకోలేకపోయాం. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ అనుకున్నంత మేర ఆకట్టుకోలేకపోయాం. ఈ సమస్య పరిష్కరించుకుని వచ్చే సీజన్లో బరిలోకి దిగుతాం" -రవిచంద్రన్ అశ్విన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్