తెలంగాణ

telangana

ETV Bharat / sports

చివర్లో తడబడిన దిల్లీ... కింగ్స్ ఎలెవన్​దే విజయం - punjab stadium

మొహాలి వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది. సొంతగడ్డపై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. సామ్ కరన్ హ్యాట్రిక్ వికెట్లతో దిల్లీ పతనాన్ని శాసించాడు. బ్యాటింగ్​లో డేవిడ్ మిల్లర్​ 43, సర్ఫరాజ్ ఖాన్ 39 ఆకట్టుకున్నారు.

కింగ్స్ ఎలెవన్​దే విజయం... చివర్లో తడబడిన దిల్లీ

By

Published : Apr 2, 2019, 12:21 AM IST

దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో కింగ్స్ ఎలెవన్ జట్టు 14 పరుగుల తేడాతో గెలిచింది. మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్​లో బ్యాటింగ్, బౌలింగ్​ రెండు విభాగాల్లోరాణించి పంజాబ్ విజయం సాధించింది.

  1. 167 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దిల్లీ జట్టు ఆరంభంలోనే పృథ్వీ షా వికెట్ కోల్పోయింది. తర్వాత నిలకడగా ఆడినా చివర్లో వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుని ఓడిపోయింది క్యాపిటల్స్ జట్టు.
  2. పంజాబ్ బౌలర్లు కరన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్, షమీ తలో రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. సామ్ కరన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా ఎంపికయ్యాడు.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఆరంభంలోనే కె.ఎల్.రాహుల్ వికెట్ కోల్పోయింది. సర్ఫరాజ్ ఖాన్ 39, డేవిడ్ మిల్లర్ 43, మన్​దీప్ సింగ్ 29 పరుగులు చేశారు. 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది పంజాబ్​.
  • ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్​ - మిల్లర్ జంట చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ నిలకడగా ఆడింది. దిల్లీ బౌలర్లలో మోరిస్ మూడు, రబాడ 2, సందీప్ 2 వికెట్లు తీసుకున్నారు.

చివర్లో తడబడిన దిల్లీ...

167 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్​కు వచ్చిన దిల్లీ జట్టు మొదట్లో బాగా ఆడినా... చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి పరాజయం చెందింది. ఇంగ్రామ్ 38, రిషభ్ పంత్ 39, ధావన్ 30 రాణించినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. 19.2 ఓవర్లకు 152 పరుగులకు ఆలౌటైంది దిల్లీ జట్టు.

కరన్ హ్యాట్రిక్​..

హ్యాట్రిక్ వికెట్లతో దిల్లీ పతనాన్ని శాసించాడు పంజాబ్​ బౌలర్​ సామ్ కరన్​. నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 144 పరుగులకు మూడు వికెట్లతో పటిష్ఠ స్థితిలో ఉన్న దిల్లీ.. 12 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోయింది.

ABOUT THE AUTHOR

...view details