తెలంగాణ

telangana

ETV Bharat / sports

నరాలు తెగే ఉత్కంఠలో.. నాలుగో టైటిల్​ నెగ్గిన ముంబయి

క్షణక్షణం నరాలు తెగే ఉత్కంఠ.. బంతికి బంతికి మారిన ఆధిక్యం... చివరి బంతికి తేలిన ఫలితం.. ఇదీ ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య ఐపీఎల్​ ఫైనల్ జరిగిన తీరు. ఈ ఉత్కంఠ పోరులో ముంబయి ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఈ విజయంతో రోహిత్​ సేన నాలుగోసారి ఐపీఎల్​ టైటిల్​ నెగ్గింది. చివర్లో మాయ చేసి ముంబయిని గెలిపించాడు మలింగ.

మలింగ

By

Published : May 13, 2019, 12:13 AM IST

Updated : May 13, 2019, 1:10 AM IST

స్కోరు ఎక్కువేం చేయలేదు... ఆరంభంలో వికెట్లు తీయలేదు... పవర్​ ప్లేలోనే గెలిచేందుకు కావాల్సిన మూడోవంతు స్కోరు చేసేసింది ప్రత్యర్థి చెన్నై.. ఇలాంటి పరిస్థితులనుంచి తేరుకుని అద్భుతమే చేసింది ముంబయి ఇండియన్స్​. చెన్నైతో జరిగిన ఐపీఎల్​ ఫైనల్​లో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. హైదరాబాద్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​​లో ముంబయి బౌలర్లు సమష్టిగా రాణించారు. ముంబయి బౌలర్లలో బుమ్రా నాలుగు ఓవర్లకు 14 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివర్లో తొమ్మిది పరుగులు చేయకుండా చెన్నైని కట్టడి చేశాడు మలింగ. 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీశాడు రాహుల్​ చాహర్. బౌలర్ల అద్భుత్ ప్రదర్శనతో ఫైనల్లో గెలిచిన ముంబయి.. నాలుగో సారి ఐపీఎల్​ టైటిల్​ సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు బుమ్రాకు దక్కింది.

టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్​ ధాటిగా ఆరంభించింది చెన్నై. డుప్లెసిస్(26) నిలకడగా ఆడగా.. షేన్ వాట్సన్​ 80 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్​మెన్​ విఫలమైనా.. చివరి వరకు క్రీజులో నిలిచాడు వాట్సన్​. 15 ఓవర్లకు 88 పరుగులే చేసింది చెన్నై జట్టు. మలింగ వేసిన 16 ఓవర్లో 20 పరుగులు కొట్టింది వాట్సన్- బ్రేవో(15) జోడి. కృనాల్​ పాండ్య వేసిన 18 ఓవర్లో 20 పరుగులు పిండుకుని చెన్నై అభిమానుల్లో ఆశలు రేకిత్తించాడు వాట్సన్​.

మలింగ మాయ..

చివరి ఓవర్​కు 9 పరుగులు అవసరమవగా.. తొలి బంతికి సింగిల్ వచ్చింది. రెండు, మూడు బంతుల్లో నాలుగు పరుగులు సాధించిన వాట్సన్ నాలుగో బంతికి రనౌట్​గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దుల్​ ఠాకుర్ 2 పరుగులు చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన తరుణంలో స్లో బాల్​ వేసి శార్దుల్​ ఎల్బీడబ్ల్యూ చేశాడు మలింగ. దీంతో నాలుగోసారి కప్పు కైవసం చేసుకుంది ముంబయి ఇండియన్స్​.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టులో పొలార్డ్(41), డికాక్(29) ఆకట్టుకున్నారు. చివర్లో పొలార్డ్ మెరుపులు మెరిపించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చెన్నై బౌలర్లలో దీపక్​ చాహర్​ 3 వికెట్లతో ఆకట్టుకోగా.. తాహిర్, శార్దుల్ ఠాకుర్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

Last Updated : May 13, 2019, 1:10 AM IST

ABOUT THE AUTHOR

...view details