తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇది నిజమా..? నమ్మలేకపోతున్నాను' - అల్జారీ జోసెఫ్

శనివారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో హైదరాబాద్​పై 40 పరుగుల తేడాతో గెలుపొందింది ముంబయి ఇండియన్స్​. కొత్త బౌలర్ అల్జారీ జోసెఫ్ 6 వికెట్లతో సన్​రైజర్స్​ పతనాన్ని శాసించాడు. ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపాడు జోసెఫ్.

ఈరోజుని నేనెప్పటికీ మరిచిపోనని చెప్పాడు ముంబయి ఇండియన్స్ బౌలర్ అల్జారీ జోసెఫ్

By

Published : Apr 7, 2019, 2:41 PM IST

హైదరాబాద్​లో సన్​రైజర్స్​ను ఓడించింది ముంబయి ఇండియన్స్. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించాడు కొత్త బౌలర్ అల్జారీ జోసెఫ్. కేవలం 12 పరుగులిచ్చి ఒక మెయిడిన్​తో సహా 6 వికెట్లు పడగొట్టి ఐపీఎల్​లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్​లో ఒక బౌలర్​ అత్యుత్తమ గణాంకాలివే కావడం గమనార్హం. మ్యాచ్​ అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ... నిజంగా ఇది నమ్మలేకపోతున్నానని... ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అల్జారీ చెప్పాడు.

2008లో పాక్​ బౌలర్​ సొహైల్ తన్వీర్.. రాజస్థాన్​ రాయల్స్​ తరఫున 14 పరుగులకు 6 వికెట్లు తీసిన ఘనతను.. అల్జారీ తన తొలి మ్యాచ్​లోనే తిరగరాశాడు.

''నమ్మలేకపోతున్నాను. ఇది నిజంగా నాకు అద్భుత ప్రారంభం. ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఎప్పుడైనా సరే నాలోని అత్యుత్తమ ఆటని బయటకు తేవాలనుకుంటాను. నేను ఆడుతున్న జట్టుకు వీలైనంత సహకారం అందించాలనేదే నా కోరిక''

- అల్జారీ జోసెఫ్, ముంబయి ఇండియన్స్ బౌలర్

అల్జారీ తీసిన వికెట్లలో వార్నర్, విజయ్ శంకర్, దీపక్ హుడా, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్ ఉన్నారు. 137 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 97 పరుగులకే ఆలౌటైంది సన్​రైజర్స్ హైదరాబాద్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details