తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్​ హైదరాబాద్​లోనే - HYDERABAD

ఐపీఎల్ ఫైనల్​ మ్యాచ్​ వేదికను చెన్నై నుంచి హైదరాబాద్​కు మార్చింది బీసీసీఐ. తొలి క్వాలిఫయర్ చెన్నైలో జరిగే అవకాశం ఉంది. ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్​లకు విశాఖపట్టణం వేదిక కానుంది.

ఐపీఎల్

By

Published : Apr 22, 2019, 6:11 PM IST

ఐపీఎల్-2019 సీజన్ క్వాలిఫయింగ్ మ్యాచ్​లు నిర్వహించే తేదీలు ఖరారయ్యాయి. ఫైనల్​ మ్యాచ్​ను మే 12న హైదరాబాద్​లో జరపనున్నారు. ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్​ జరగనుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్​ చెన్నైలో జరిగే అవకాశం ఉంది. చెన్నై పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే ఈ మ్యాచ్​కు చెన్నై వేదికవుతుంది. రెండో క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్​లకు విశాఖ వేదిక కానుంది.

ఫైనల్​ మ్యాచ్​ మొదట చెన్నైలో నిర్వహించాలని బీసీసీఐ భావించింది. స్టేడియంలోని మూడు స్టాండ్స్​ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి తెచ్చుకోవడంలో విఫలమైంది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్. ఈ కారణంగా ఫైనల్​ మ్యాచ్ వేదికను చెన్నై నుంచి హైదరాబాద్​కు మార్చింది బీసీసీఐ పాలక మండలి.

ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్​లు​ మాత్రం విశాఖకు మార్చారు. ఈ మ్యాచ్​లు మే 8, 10 తేదీల్లో జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details