ముంబయితో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ మందిని(132) ఔట్ చేసిన వికెట్ కీపర్‌గా ఘనత సాధించాడు. ఇందులో 98 క్యాచ్లుండగా, 38 స్టంపింగ్స్ ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకున్న ధోని... కోల్‌కతా కీపర్ దినేశ్ కార్తీక్‌ను అధిగమించాడు. దినేశ్ కార్తీక్ 131 ఔట్లు చేయగా.. రాబిన్ ఊతప్ప 90తో మూడో స్థానంలో ఉన్నాడు.