తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఈ పిచ్​లపై బ్యాట్స్​మెన్​ ఆడటం కష్టం' - పిచ్

చెన్నై చెపాక్​ పిచ్​పై తక్కువ స్కోర్లే నమోదవుతున్నాయని సూపర్​కింగ్స్​ కెప్టెన్​ ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి మైదానంలో తాము ఆడాలని కోరుకోవట్లేదని తెలిపాడు.

ధోనీ

By

Published : Apr 10, 2019, 12:04 PM IST

చెన్నై చెపాక్ పిచ్​పై మహేంద్రసింగ్ ధోని మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. తక్కువ స్కోర్లే నమోదవుతున్నాయని పేర్కొన్నాడు. తాము మ్యాచ్​లో గెలిచినప్పటికీ ఇలాంటి పిచ్​పై ఆడాలని కోరుకోవట్లేదని మ్యాచ్​ అనంతరం తెలిపాడు ధోని. బెంగళూరుతో మ్యాచ్ తర్వాత కూడా ఈ పిచ్​పై అభ్యంతరం చెప్పాడు మహీ.

"ఇలాంటి పిచ్​లపై ఆడాలని మేము అనుకోవట్లేదు. ఇక్కడ మరీ తక్కువ స్కోర్లు నమోదవుతున్నాయి. ఈ పిచ్​లపై బ్యాట్స్​మెన్​ పరుగుల కోసం కష్టపడాల్సి వస్తుంది"-- మహేంద్ర సింగ్ ధోనీ

మంగళవారం కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై 7 వికెట్ల తేడాతో గెలిచింది. రైడర్స్ 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులకే పరిమితమైంది. అనంతరం తడబడిన చెన్నై లక్ష్యాన్ని ఛేదించేందుకు 18 ఓవర్లు ఆడింది.

ABOUT THE AUTHOR

...view details