కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది దిల్లీ. కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్(97*) అదరగొట్టగా, పంత్ 46 పరుగులతో బాధ్యతయుత ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రసెల్, నితీశ్ రానా తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ జట్టు కోల్‌కతాను 178 పరుగులకు పరిమితం చేసింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించిన దిల్లీ క్యాపిటల్స్ మూడో ఓవర్లోనే పృథ్వీ షా(14) వికెట్ కోల్పోయింది. అనంతరం కొద్దిసేపటికే కెప్టెన్ శ్రేయాస్(6) రసెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వీరిద్దరు ఔటైనా... శిఖర్- పంత్ జోడీ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టింది. ధావన్ 97 పరుగులతో చెలరేగగా... పంత్ 46 పరుగులు చేశాడు. వీరిద్దరు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తర్వాత రిషభ్ ఔటైనా.. ధావన్- ఇంగ్రామ్ మిగతా పని పూర్తి చేశారు. విజయానికి 10 పరుగుల కావాల్సిన తరుణంలో ఇంగ్రామ్ ఫోర్, సిక్సర్‌తో ఇన్మింగ్స్ను ముగించాడు.