తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాణించిన గిల్​, రసెల్... దిల్లీ లక్ష్యం 179

దిల్లీతో మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోల్​కతా జట్టు నిర్ణీత 20ఓవర్లలో 178 పరుగులు చేసింది. శుభ్​మన్ గిల్ అర్ధశతకంతో ఆకట్టుకోగా, రసెల్ 45 పరుగులతో మెరుపులు మెరిపించాడు. దిల్లీ బౌలర్లలో రబాడా, మోరిస్, కీమో పాల్ తలో రెండు వికెట్లు తీశారు.

రసెల్

By

Published : Apr 12, 2019, 9:59 PM IST

దిల్లీ క్యాపిటల్స్​తో తలపడుతున్న కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. కోల్​కతా వేదికగగా జరుగుతున్న మ్యాచ్​లో శుభ్​మన్ గిల్(65, 39 బంతుల్లో)​ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మరోసారి చివర్లో రసెల్ (45) విజృంభించాడు. దిల్లీ బౌలర్లలో రబాడా, మోరిస్, కీమో పాల్.. తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

రసెల్

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోల్​కతా జట్టు... ఖాతా తెరవకుండానే జోయ్ (0) వికెట్ కోల్పోయింది. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్​లో జోయ్ ఎదుర్కున్న తొలి బంతికే ఔటయ్యాడు. అనంతరం శుభ్​మన్ గిల్- ఊతప్ప మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు వేగాన్ని పెంచారు. 9వ ఓవర్లో రబాడా బౌలింగ్​లో ఊతప్ప (28) వెనుదిరిగాడు. కొద్దిసేపటికే నితీశ్ రానా (11), దినేశ్ కార్తీక్ (2)​ కూడా పెవిలియన్​ చేరారు. చివర్లో రసెల్ మళ్లీ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.

ముందు గిల్...తర్వాత రసెల్

జోయ్ వికెట్ కోల్పోయినప్పటికీ శుభ్​మన్​ గిల్​ మొదటి నుంచి ధాటిగా ఆడాడు. 35 బంతుల్లోనే ఐపీఎల్​లో తన రెండో అర్ధశతకాన్ని నమోదుచేశాడు. 7 ఫోర్లు, 2సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం పాల్​ బౌలింగ్​లో​ ఔటయ్యాడు. తర్వాత రసెల్ 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు.

19వ ఓవర్లో ప్రమాదకరంగా మారుతున్న రసెల్​ని క్రిస్ మోరిస్ పెవిలియన్​ చేర్చాడు. రసెల్ ఔటైన తర్వాత కోల్​కతా స్కోరు వేగం మందగించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details