తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ 2019: రాయల్స్​ పరాజయాలకు బ్రేక్​ పడేనా? - రహానే

రాజస్థాన్​ రాయల్స్​తో మ్యాచ్​ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలనుకుంటోంది చెన్నై సూపర్​ కింగ్స్​. సొంత గడ్డపై ఆడుతుండటం ధోనీ సేనకు మరో సానుకూలాంశం. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్​లలో ఓడిన రాయల్స్​ గెలుపు కోసం ఆరాటపడుతోంది. నేడు ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్​లో 12వ మ్యాచ్​ జరగనుంది.

ధోనీ-రహానే

By

Published : Mar 31, 2019, 6:00 AM IST

ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ విజయం సాధించి మూడో గెలుపుపై కన్నేసింది చెన్నై సూపర్​ కింగ్స్​. మరోవైపు రెండు వరుస పరాజయాలనెదుర్కొన్న రాయల్స్​ గెలుపు కోసం తాపత్రయపడుతోందు. ఈ రెండింటి మధ్య చెన్నై వేదికగా నేడు మ్యాచ్​ జరగనుంది.

సొంతగడ్డపై రెండో మ్యాచ్​ ఆడుతున్న ధోనీసేన రాజస్థాన్​పై సత్తాచాటి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలనుకుంటోంది. తొలి మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరును 70 పరుగులకే కట్టడి చేసింది సూపర్​కింగ్స్​. దిల్లీతో జరిగిన రెండో మ్యాచ్​లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేసి విజయం సాధించింది.

పంజాబ్​తో జరిగిన తొలి మ్యాచ్​లో రాజస్థాన్​కు అనూహ్య ఓటమి ఎదురైంది. రెండో మ్యాచ్​లోనూ సంజూ శాంసన్ శతకం చేసినప్పటికీ బౌలర్ల పేలవ ప్రదర్శనతో ఓటమి చవి చూసింది.

చెన్నై సూపర్ కింగ్స్​

గత రెండు మ్యాచుల్లోనూ చెన్నై జట్టులో బౌలర్లు అద్భుతంగా రాణించారు. హర్భజన్, తాహిర్​, బ్రావో, జడేజాల ధాటికి ప్రత్యర్థి జట్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యాయి. మరోసారి అలాగే సత్తా చాటాలని చెన్నై అభిమానులు ఆశిస్తున్నారు.

బౌలర్ల స్థాయిలో బ్యాట్స్​మెన్ ప్రదర్శన లేదు. బెంగళూరు మ్యాచ్​లో లక్ష్యం చిన్నదైనా ఛేదించడానికి 18 ఓవర్లు తీసుకున్నారు. రెండో మ్యాచ్​ కూడా చివరి ఓవర్​ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. వాట్సన్, రైనా, ధోనీలపైనే ఎక్కువగా ఆధారపడుతుంది చెన్నై. రాయుడు ఫామ్ అందుకోవాల్సి ఉండగా, డుప్లెసిస్​ను వినియోగించుకోవాల్సి ఉంది.

రాజస్థాన్ రాయల్స్​

బ్యాట్స్​మెన్ రాణిస్తున్నప్పటికీ బౌలర్ల ప్రదర్శనే ఆందోళన కలిగిస్తోంది. తొలి మ్యాచ్​లో ప్రత్యర్థికి 180 పరుగులిస్తే... రెండో మ్యాచ్​లో 198 పరుగుల లక్ష్యాన్ని బౌలర్లు కాపాడలేకపోయారు. బ్యాటింగ్​లో బలంగా కనిపిస్తోంది రాజస్థాన్ జట్టు. రెండు మ్యాచ్​ల్లోనూ శాంసన్ విజృంభించాడు. ముఖ్యంగా హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో శతకంతో అదరగొట్టాడు.

బట్లర్​ తొలి మ్యాచ్​లో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రెండో మ్యాచ్​లో 70 పరుగుల చేసి.. కెప్టెన్​ రహానే ఫామ్​లోకి రావడం కలిసొచ్చే అంశం. తొలిమ్యాచ్​లో స్టీవ్ స్మిత్​ విఫలమవగా, రెండో మ్యాచ్​లో బ్యాటింగ్ రాలేదు. చెన్నైపై స్మిత్​ రాణించాలని రాయల్స్ అభిమానులు కోరుకుంటున్నారు. బ్యాటింగ్​లో మెరుస్తున్నా సమష్టి ప్రదర్శనలో విఫలమవుతోంది రాయల్స్​ జట్టు.

జట్ల అంచనా:

చెన్నై సూపర్ కింగ్స్:

మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, కేదార్ జాదవ్, బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, శార్దుల్ ఠాకుర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, మురళీ విజయ్, కరణ్ శర్మ, డేవిడ్ విల్లీ

రాజస్థాన్ రాయల్స్:

అజింక్య రహానే(కెప్టెన్), బట్లర్, సంజూ శాంసన్(కీపర్), స్మీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాఠి, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్, ​జయదేవ్ ఉనద్కత్​, శ్రేయాస్ గోపాల్, ధవల్ కులకర్ణి, స్టువర్ట్ బిన్ని, వరుణ్ ఆరోన్, మనన్ వోహ్రా.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details