ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్లోచెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడుతున్న దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంత్ (38, 25 బంతుల్లో) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోలేదు. చెన్నై బౌలర్లలో హర్భజన్, బ్రావో, దీపక్ చాహర్, జడేజా తలో రెండు వికెట్లు తీయగా.. తాహిర్ ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ ఆరంభంలోనే పృథ్వీ షా (5) వికెట్ కోల్పోయింది. మరికాసేపటికే ధావన్ (18) ఔటయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన్రో(27) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు.