సాధారణంగా ఐపీఎల్ ఆడితేనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఉత్తమ క్యాచ్ అంశాల్లో ఆటగాడికి లక్ష రూపాయల బహుమతి అందిస్తారు. కానీ వీక్షకులూ లక్ష గెలుచుకునే అవకాశముందని నిరూపించాడో అభిమాని.
- ఎలా గెలుచుకోవచ్చు...?
సాధారణంగా ఐపీఎల్ ఆడితేనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఉత్తమ క్యాచ్ అంశాల్లో ఆటగాడికి లక్ష రూపాయల బహుమతి అందిస్తారు. కానీ వీక్షకులూ లక్ష గెలుచుకునే అవకాశముందని నిరూపించాడో అభిమాని.
మ్యాచ్ చూడటానికి వెళ్లాడు. అనుకోకుండా అదృష్టం కలిసొచ్చింది.ఏమైందనుకుంటున్నారా....
ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి దిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానానికి వెళ్లాడొక అభిమాని. మ్యాచ్ 14.4వ ఓవర్లో పృథ్వీషా కొట్టిన సిక్స్.... వీక్షకుల గ్యాలరీలో పడే సమయానికి చాలా మంది బంతిని అందుకునేందుకు ఎగబడ్డారు. అందులో ఓ పెద్దాయన క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి సఫలమయ్యాడు. ఇంకేముంది హారియర్ ఫ్యాన్ 'క్యాచ్ విన్నర్'కు అందించే లక్ష రూపాయల బహుమతికి ఎంపికయ్యాడు. అదృష్టం అంటే ఇదేనేమో మ్యాచ్ కోసం వెళ్తే లక్ష పట్టేశాడు.