తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs SL: కుప్పకూలిన టీమ్ఇండియా.. లంక లక్ష్యం 82

శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో భారత​ బ్యాటింగ్​ లైనప్​ కుప్పకూలింది. కెప్టెన్ ధావన్​ సహా ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయకపోవడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 81 పరుగులు చేసింది.

By

Published : Jul 29, 2021, 9:32 PM IST

Updated : Jul 29, 2021, 10:21 PM IST

match
మ్యాచ్​

శ్రీలంకతో జరుగుతోన్న చివరిదైన మూడో టీ20లో టీమ్ఇండియా బ్యాట్స్​మెన్ దారుణ ప్రదర్శన చేశారు. కరోనా కారణంగా దాదాపు ఎనిమిది మంది ఆటగాళ్లు దూరమవడం వల్ల సగం మంది కొత్త క్రికెటర్లతో బరిలో దిగిన ధావన్​సేన ఈ మ్యాచ్​లో నిర్ణీత 20ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి కేవలం 81 పరుగులే చేసింది.

ఆద్యంతం తడబాటే..

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న టీమ్​ఇండియాకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్​లోనే కెప్టెన్​ ధావన్​.. స్లిప్​లో క్యాచ్​ ఇచ్చి ఔట్​ అయ్యాడు. టీ20లో టీమ్​ఇండియా సారథి గోల్డెన్​ డక్​(తొలిబంతికే ఔట్​ అవ్వడం)గా వెనుదిరగడం ఇదే తొలిసారి. ఆ తర్వాత వచ్చిన దేవదత్​ పడిక్కల్​(9) కూడా ఎల్​బీడబ్ల్యూగానే వెనుదిరిగాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన శాంసన్​(0).. ఆడిన మూడు బంతులూ తడబడ్డాడు. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న శాంసన్ కూడా ఎల్​బీడబ్ల్యూగానే ఔట్​ అయ్యాడు. అప్పటివరకు క్రీజులో ఉండి నెమ్మదిగా ఆడిన గైక్వాడ్​(14) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన నితీశ్​ రాణా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం ఆరు పరుగులే చేసి ఔట్​ అయ్యాడు. ఇలా 36పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమ్​ఇండియా.

టాప్​ ఆర్డ్​ర్​, మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​లు చేతులెత్తేయగా.. క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్​(16), కుల్దీప్​ యాదవ్​లు కాస్త పరుగులు రాబట్టడం వల్ల స్కోరు ఆ మాత్రమైనా వెళ్లిందని చెప్పాలి. ముఖ్యంగా 23 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచిన కుల్దీప్​ యాదవ్​.. ఇన్నింగ్స్​ టాప్​ స్కోరర్​ కావడం గమనార్హం. భువనేశ్వర్ ఔట్​ అయిన తర్వాత వచ్చిన రాహుల్​ చాహర్​, వరుణ్​ చక్రవర్తి పేలవ ప్రదర్శనే చేశారు. ఒకానొక సందర్భంలో జట్టు ఆలౌట్​ అవుతుందని అందరు భావించారు. కానీ కుల్దీప్​ ఆడటం వల్ల అది జరగలేదు.

లంక బౌలర్లు సమిష్టిగా రాణించగా.. వారి ముందు టీమ్​ఇండియా యువ బ్యాట్స్​మెన్​ కనీసం నిలువలేకపోయారు. ముఖ్యంగా వానిందు హసరంగ(4 వికెట్లు) తన పేస్​తో ముప్పుతిప్పలు పెట్టాడు. అతడికి తోడుగా ఆర్​ మెండిస్​(1 వికెట్​), సారథి శనక(2వికెట్లు) నిలవడం వల్ల టీమ్​ఇండియా కోలుకోలేకపోయింది.

ఇన్నింగ్స్​ మొత్తంలో కేవలం 4 ఫోర్లే నమోదయ్యాయి. ఒక్కటంటే ఒక్క 6కు లేదు.

నిర్ణయాత్మక టీ20 కారణంగా.. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు ట్రోఫీని కైవశం చేసుకోనుంది.

శ్రీలంక టూర్​లో ధావన్​ సేనకు ఇదే చివరి మ్యాచ్​. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్​ను దక్కించుకుంది టీమ్​ఇండియా.

ఇదీ జరిగింది:-'అలా చేస్తే బుమ్రా పని ఖతం.. జాగ్రత్త పడాల్సిందే'

Last Updated : Jul 29, 2021, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details