Injured Players Before World Cup :మరో 19 రోజుల్లో ప్రారంభమయ్యే వరల్డ్‌కప్‌కోసం ప్రపంచంలోని మేటి జట్లు సన్నద్ధమవుతున్నాయి. నాలుగేళ్లకొకసారి వచ్చే ఈ మెగా టోర్నీలో టైటిల్ నెగ్గాలని ఆయా జట్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అయితే ఇందులో పాల్గొనే దేశాల్లో కొన్ని జట్లు.. ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఆడుతున్నాయి. ప్రపంచకప్ కంటే ముందు ఈ పర్యటనలు తమతమ ప్లేయర్లకు ప్రాక్టీస్‌లా ఉపయోగపడతాయని అనుకున్న వారికి.. కొత్త సమస్యలు వస్తున్నాయి. ఆయా జట్లలో కీలక ప్లేయర్లు ఆట మధ్యలో గాయాల బారిన పడుతున్నారు. దీంతో కొందరు ప్రపంచకప్‌లోని కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోగా.. మరికొందరు పూర్తి టోర్నీకే దూరం అయ్యే ప్రమాదం ఏర్పడింది. అయితే ఈ జాబితాలో ఉన్న ఆయా దేశాల ప్లేయర్లెవరంటే..
- నజీమ్ షా (పాకిస్థాన్).. ఈ లిస్ట్‌లో పాకిస్థాన్ పేసర్ నజీమ్ షా చేరాడు. 2023 ఆసియా కప్ సూపర్ 4లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో షా.. గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా అతడి భుజానికి గాయమైంది. దీంతో షా.. రానున్న ప్రపంచకప్‌నకు పూర్తిగా అందుబాటులో ఉండడని తెలుస్తోంది.
- టిమ్ సౌథీ (న్యూజిలాండ్).. న్యూజిలాండ్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఆ పర్యటనలో కివీస్.. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో 4 టీ20, 4 వన్డే మ్యాచ్‌ల సిరీస్ పూర్తయ్యింది. అయితే తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో కివీస్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి బొటన వేలుకు గాయమైంది. దీంతో అతడు 2023 వరల్డ్ కప్‌నకు అందుబాటులో ఉండేది డౌటే.
- ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా).. సౌతాఫ్రికా-ఆస్ట్రేలియామధ్య ద్వైపాకిక్ష సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా బంతి అతడి చేతిని బలంగా తాకింది. దీంతో అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే ఆసీస్‌కు ఎంతో కీలకమైన హెడ్.. ప్రపంచకప్‌కు ముందు ఇలా గాయపడడం ఆ జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది.
- శ్రేయస్ అయ్యర్ (భారత్).. కొంతకాలం గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. కానీ ఈ మ్యాచ్‌లో అతడు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక ఆ తర్వాత మ్యాచ్‌ల్లో అయ్యర్.. జట్టుకు దూరం అయ్యాడు. అయితే అతడు మళ్లీ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వరల్డ్ కప్ సమయానికి అయ్యర్ కోలుకునే ఛాన్స్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
- మహీష తీక్షణ(శ్రీలంక)..శ్రీలంక ప్లేయర్ మహీష తీక్షణ 2023 ఆసియా కప్ సూపర్ 4లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో అతడి భుజానికి గాయమైంది. దీంతో అతడు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మరో 20 రోజుల్లో అతడు పూర్తిగా కోలుకోకపోతే మెగాటోర్నీలోనూ ఆడటం కష్టం.