తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఔట్​ ఇచ్చారని టీమ్ వాకౌట్- సగం మ్యాచ్​లో విజేతగా మరో జట్టు​- అసలేం జరిగిందంటే?

Indonesia Vs Cambodia Cricket Match : ద్వైపాక్షిక టీ20 సిరీస్​లో భాగంగా​ ఇండోనేసియా, కంబోడియా జట్ల మధ్య మ్యాచ్​ జరిగింది. ఈ మ్యాచ్​లో తమ బ్యాటర్​ను ఔట్​గా ప్రకటించారని కంబోడియా జట్టు మ్యాచ్​ ఆడటానికి నిరాకరించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Indonesia Vs Cambodia Cricket Match
Indonesia Vs Cambodia Cricket Match

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 7:52 PM IST

Updated : Nov 24, 2023, 8:42 PM IST

Indonesia Vs Cambodia Cricket Match : వర్షం కారణంగా క్రికెట్ మ్యాచ్​లు ఆగిపోవడం, రద్దు కావడం సహజం. కొన్ని సందర్భాల్లో వెలుతురు తక్కువగా ఉందని.. బాల్ కనిపించదని మ్యాచ్​ను ఆపేస్తారు. ఇలాంటి సమయంలో డక్​వర్త్ లూయిస్​ పద్ధతిలో విజేతను ప్రకటిస్తారు. అయితే ఇవేవీ జరగకుండానే ఓ మ్యాచ్​ మధ్యలోనే ఆగిపోయింది. విజేతను కూడా ప్రకటించారు. ఆసియా క్రికెట్ జట్లు కంబోడియా, ఇండోనేసియా మధ్య జరిగిన మ్యాచ్​లో అలాంటి ఆసక్తికర ఘటన జరిగింది. తమ జట్టు బ్యాటర్​ను ఔట్​గా ప్రకటించారనే కారణంతో కంబోడియా టీమ్​ మైదానం నుంచి వాకౌట్ చేసింది. దీంతో ఇండోనేసియా జట్టును విజేతగా ప్రకటించారు నిర్వాహకులు.

ఇదీ జరిగింది..
7 మ్యాచ్​ల టీ20 సిరీస్​ కోసం కంబోడియా జట్టు ఇండోనేసియా పర్యటనకు వచ్చింది. నవంబర్ 20న ఈ సిరీస్​లో మొదటి మ్యాచ్​ జరిగింది. నవంబర్​ 22 వరకు ఐదు మ్యాచ్​లు జరిగాయి. అందులో మూడు మ్యాచ్​ల్లో ఇండోనేసియా, రెండింట్లో కంబోడియా గెలిచాయి. అయితే గురువారం ఇరు జట్ల మధ్య ఆరో మ్యాచ్​ జరిగింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కంబోడియా 11.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.

ఈ క్రమంలో ఇండోనేసియా బౌలర్ ధనేశ్​ కుమార్​ శెట్టి ఇన్నింగ్స్​ 12 ఓవర్ వేశాడు. ఆ ఓవర్​ మూడో బంతిలో కంబోడియా బ్యాటర్ లక్మన్ బట్ (20) బాదిన బంతిని ధర్మకేసుమ క్యాచ్ పట్టాడు. దీంతో అంపైర్​ ఔట్​గా ప్రకటించాడు. అయితే లక్మన్ ఔట్​ను కంబోడియా ప్లేయర్లు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఔట్ విషయం వివాదాస్పదమైంది. దీంతో కంబోడియా జట్టు మ్యాచ్ కొనసాగించేందుకు అంగీకరించలేదు. ఆ జట్టు ప్లేయర్లు గ్రౌండ్​ నుంచి వాకౌట్ చేశారు. దీంతో చేసేదేమి లేక అంపైర్లు ఇండినేసియా జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో అదే రోజు జరగాల్సిన మరో మ్యాచ్​లో కూడా రద్దైంది. ఇండోనేసియా జట్టు 4-2 తేడాతో సిరీస్​ను సొంతం చేసుకుంది. అయితే ఈ ఘటనపై అధికారికంగా ఏ జట్టూ స్పందించలేదు.

వరల్డ్​ కప్​ ట్రోఫీకి అవమానం- మిచెల్​ మార్ష్​పై కేసు నమోదు- జీవితకాల నిషేధం!

మహిళల ప్రీమియర్ లీగ్​కు బీసీసీఐ సన్నాహాలు- WPL 2024 వేలం అప్పుడే!

Last Updated : Nov 24, 2023, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details