తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs WI: టాస్​ గెలిచిన భారత్.. విండీస్ బ్యాటింగ్

వెస్డిండీస్​తో జరుగుతున్న తొలి వన్డేల్లో భారత జట్టు టాస్​ గెలిచింది. వెస్టిండీస్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్​తోనే ఆల్​రౌండర్​ దీపక్ హుడా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మ్యాచ్​లో దిగ్గజ గాయని లతా మంగేష్కర్​కు సంతాపంగా భారత క్రికెటర్లు నల్ల బ్యాడ్జిలు ధరించనున్నట్లు తెలుస్తోంది.

india won the toss
ind vs wi

By

Published : Feb 6, 2022, 1:07 PM IST

Updated : Feb 6, 2022, 1:52 PM IST

నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్​తో తొలి వన్డేలో టీమ్​ఇండియా టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ బ్యాటింగ్ చేయనుంది. ఇది భారత్ ఆడుతున్న 1000వ వన్డే​ కావడం విశేషం. ఈ మ్యాచ్​తోనే యువ క్రికెటర్​, ఆల్​రౌండర్​ దీపక్ హుడా.. భారత తరఫున వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు.

లతా మంగేష్కర్‌కు సంతాపం..

ఈ మ్యాచ్​లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ మృతికి భారత క్రికెటర్లు సంతాపం తెలియజేశారు. అందులో భాగంగానే చేతికి నల్ల బ్యాండ్‌ ధరిస్తారని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా చెప్పారు.

నల్ల బ్యాండ్​లతో భారత క్రికెటర్లు

జట్లు:

భారత్:రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

వెస్టిండీస్:బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), బ్రూక్స్, డారెన్ బ్రావో, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్​ (కెప్టెన్), జేసన్ హోల్డర్, ఫేబియన్ అలెన్, జోసెఫ్, కీమర్ రోచ్, అకీల్ హోసేన్.

ఇదీ చూడండి:Rohit Sharma: '1000వ వన్డేకు కెప్టెన్సీ చేయడం నా అదృష్టం'

Last Updated : Feb 6, 2022, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details