Ind Vs WI Test : వెస్టిండీస్‌తో మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానున్న రెండో టెస్ట్ కోసం టీమ్ఇండియా సిద్ధంగా ఉంది. మొదటి టెస్టులోనే విండీస్ టీమ్‌ను తమ సొంత గడ్డపై చిత్తు చేసిన రోహిత్ సేన.. క్వీన్స్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లోనూ గెలవాలని పట్టుదలతో ఉంది. యశ్వస్వి జైస్వాల్ ,ఇషాన్ కిషన్ లాంటి యంగ్ ప్లేయర్స్‌తో పాటు రోహిత్, కోహ్లీ, రహానే లాంటి మేటి ప్లేయర్స్ కలయికతో ఏర్పడిన తుది జట్టు అందరి అంచనాలను దాటి ప్రత్యర్థులను చిత్తు చేసింది. ఇక రెండో టెస్ట్‌కు కూడా ఇదే టీమ్‌తో కొనసాగే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఓ వైపు విరాట్ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడి తన కెరీర్లో ఓ మైలు రాయిని దాటనున్నాడు. ఇక దశాబ్దాలుగా వెస్టీండీస్తో భారత్ తలపడి గెలుపోటమల పోరటాంలో ఈదుతూ వచ్చింది. ఇక అనేక వేదికలపై ఈ జట్టు జట్లు ఎన్నో రికార్డులు నెలకొల్పాయి. అవేంటంటే..
విండీస్‌తో రెండో టెస్ట్.. క్వీన్స్ పార్క్ వేదికపై నమోదైన రికార్డులివే!
India Vs West Indies Records : వెస్టిండీస్‌తో మరి కొన్ని గంటల్లో రెండో టెస్ట్.. క్వీన్స్ పార్క్ వేదికగా జరగనుంది. ఈ వేదికపై ఇరు జట్ల రికార్డులను ఓ లుక్కేద్దాం...
india vs west indies
వెస్టిండీస్ vs ఇండియా రికార్డులు:
- ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మొత్తం 99 గేమ్‌లు ఆడాయి. అందులో వెస్టిండీస్ 30 గెలిచి ఆధిక్యతను చాటుకోగా.. భారత్ 23 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మరో 46 గేమ్‌లు డ్రాగా ముగిశాయి.
- విండీస్ వేదికగా ఇరు జట్లు 52 సార్లు తలపడగా..అందులో భారత్ 10 గెలవగా.. 16 విజయాలు విండీస్ సేన సొంతమైంది. ఇక 26 డ్రా గా ముగిశాయి.
- టెస్టులో భారత్‌పై వెస్టిండీస్ అత్యధిక స్కోరు 644 కాగా.. అత్యల్ప స్కోరు 100
- వెస్టిండీస్‌పై భారత్ అత్యధిక స్కోరు 649 కాగా, వారి అత్యల్ప స్కోరు 75గా నమోదైంది.
క్వీన్స్ వేదిక రికార్డులు ఇవే..
- ఇక ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ పేసర్లకు బాగా అనకూలిస్తుంది.
- ఇప్పటి వరకు ఈ స్టేడియంలో జరిగిన 61 మ్యాచ్‌ల్లో పేసర్లు 27.39 సగటుతో 1157 వికెట్లు తీయగా.. స్పిన్ బౌలర్లు 36.57 సగటుతో 626 వికెట్లు తీశారు.
- ఈ వేదికపై ఆడిన మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన స్కోరు 302.
- క్వీన్స్ పార్క్ ఓవల్‌లో ఆడిన 13 టెస్టుల్లో భారత్ సాధించిన విజయాలు 3. మరో 3 మ్యాచ్‌లు ఓడిపోగా.. మిగతా 7 డ్రా చేసుకుంది.
- ఇక టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి అశ్విన్‌కు 14 వికెట్లు అవసరం. అతడు మొదటి మ్యాచ్ దూకుడును కొనసాగిస్తే ఈ సిరీస్‌లో అది సాధ్యమవుతోంది.
- భారత్‌తో వందో టెస్టు ఆడనున్న మూడో జట్టు విండీస్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇప్పటికే ఆ మైలురాయిని అందుకున్నాయి.
- కోహ్లీకి ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్. అతను ఇప్పటిదాకా 110 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20లు ఆడాడు.