India vs West Indies: కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమ్ఇండియా టాస్ గెలిచింది. వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు.. టీ20 సిరీస్ కోసం సిద్ధమైంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా జరగుతుంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ను అందుకు సన్నాహకంగా టీమ్ఇండియా భావిస్తోంది. మరోవైపు తమకు అచ్చొచ్చిన ఫార్మాట్‌లో భారత్‌కు గట్టిపోటీ ఇవ్వాలని కరీబియన్ జట్టు పట్టుదలతో ఉంది.
ఐదు రోజుల వ్యవధిలో 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్‌లో నాలుగు పిచ్‌లు సిద్ధం చేశారు.