తెలంగాణ

telangana

ETV Bharat / sports

India vs Pakistan Super 4 Asia Cup 2023 : క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. భారత్, పాక్​ పోరు పక్కా.. రిజర్వ్ డే ప్రకటన - ఆసియా కప్ 2023 భారత్ vs పాకిస్థాన్

India vs Pakistan Super 4 Asia Cup 2023 : ఆసియా కప్​లో భాగంగా భారత్​, పాకిస్థాన్​ మధ్య జరిగే మ్యాచ్​కు రిజర్వ్ డేను ప్రకటించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్​. సెప్టెంబర్​ 10న మ్యాచ్​ జరగనుండగా.. తర్వాతి రోజును రిజర్వ్ డేగా ప్రకటించింది.

India vs Pakistan Super 4 Asia Cup 2023
India vs Pakistan Super 4 Asia Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 2:14 PM IST

Updated : Sep 8, 2023, 2:37 PM IST

India vs Pakistan Super 4 Asia Cup 2023 :India vs Pakistan Super 4 Asia Cup 2023 : చిరకాల ప్రత్యర్థులు తలపడే పోరు కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది ఆసియా క్రికెట్ కౌన్సిల్​. ఆసియా కప్​సూపర్ ఫోర్​లో భాగంగా భారత్​, పాకిస్థాన్​ మధ్య జరిగే మ్యాచ్​కు రిజర్వ్​ డేను ప్రకటించింది. ఈ మ్యాచ్​ సెప్టెంబర్​ 10న శ్రీలంకలోని ప్రేమదాస ఇంటర్నేషనల్​ స్టేడియంలో జరగనుంది. అయితే, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆటకు ఏదైనా ఆంటంకం ఏర్పడితే సెప్టెంబర్​ 11న ఆగిపోయిన సమయం నుంచి మ్యాచ్​ జరగనుంది.

అయితే, టోర్నీలోని ఇతర సూపర్​ ఫోర్​ మ్యాచ్​లకు మాత్రం ఎలాంటి రిజర్వ్ డేను ప్రటించలేదు. టోర్నీ ఫైనల్​కు మాత్రమే రిజర్వ్ డే ఉండగా.. తర్వాత భారత్​, పాక్​ మ్యాచ్​కు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిచింది. ఒకవేళ మ్యాచ్​ మధ్యలో ఆగిపోతే.. ప్రేక్షకలు తమ టికెట్లతో రిజర్వ్ డే మ్యాచ్​కు రావొచ్చని చెప్పింది.

"ఆసియా కప్​ సూపర్ ఫోర్​లో భాగంగా జరిగే భారత్, పాక్ మ్యాచ్​కు రిజర్వ్ డేను ఏర్పాటు చేశాం. సెప్టెంబర్​ 10న శ్రీలంక కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఏదైనా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్​ ఆగిపోతే ఆ సమయం నుంచి సెప్టెంబర్​ 11న తిరిగి మొదలవుతుంది"
-ఆసియా క్రికెట్ కౌన్సిల్

Asia Cup 2023 Super 4 IND VS PAK : అంతకు ముందు సెప్టెంబర్​ 2న.. గ్రూప్‌ దశలో చిరకాల ప్రత్యర్థులు టీమ్​ఇండియా-పాక్‌ (IND vs PAK) మధ్య మ్యాచ్‌.. వర్షం కారణంగా రద్దు అయింది. భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన సమయానికి జోరు వర్షం కురిసింది. ఆ తర్వాత చాలాసేపు వేచి చూసినప్పటికీ వర్షం తగ్గకపోవడం వల్ల చివరికి చేసేదేమి లేక పాక్‌ జట్టు బ్యాటింగ్‌కు దిగకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ మ్యాచ్‌ను చూద్దామనుకున్న వరల్డ్ క్రికెట్​ ఫ్యాన్స్​కు తీవ్ర నిరాశే ఎదురైంది. కారణంగా అభిమానులందరూ డీలా పడిపోయారు.

Trump Dhoni : ధోనీకి ట్రంప్ స్పెషల్​ ఇన్విటేషన్​.. గోల్ఫ్​ ఆడేందుకు పిలిచి..

Asia Cup Super 4 : ఆసియా కప్​పై రోహిత్​ సేన కన్ను.. ఆ జట్టును చిత్తు చేసేందుకు మాస్టర్​ ప్లాన్​!

Last Updated : Sep 8, 2023, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details