రెండో టెస్టులో టీమ్ఇండియా.. న్యూజిలాండ్‌కు భారీ లక్ష్యం విధించింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న కివీస్.. మూడోరోజు టీ విరామానికి 13/1తో నిలిచింది. విజయానికి మరో 527 పరుగులు కావాలి. క్రీజులో యంగ్, మిచెల్ ఉన్నారు.
అంతకు మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా.. రెండో ఇన్నింగ్స్‌ను 276/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కోహ్లీ 36, గిల్ 47, అక్షర్ పటేల్ 41 పరుగులతో ఆకట్టుకున్నారు. దీంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం నిలిచింది.
తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 325 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 150 పరుగులతో రాణించగా, గిల్ 44, అక్షర్ 52 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. కివీస్ బౌలర్ అజాజ్ 10 వికెట్లూ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్.. 62 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది.