లఖ్‌నవూ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో భారత్ పట్టుదలతో ఆడి గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత బౌలర్ల ధాటికి 8 వికెట్ల నష్టానికి 99 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో భారత్ కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. చివరి ఓవర్లో విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20ని కివీస్ కైవసం చేసుకోగా.. తాజా మ్యాచ్‌ను గెలిచి భారత్ సిరీస్ 1-1తో సమం చేసింది.
లో స్కోర్ మ్యాచ్.. అయినా ఉత్కంఠే.. చివరి ఓవర్లో భారత్ విజయం.. సిరీస్ సమం
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20ని భారత్ గెలుచుకుంది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది.
బ్యాటింగ్‌లో కివీస్ సాంతం తడబడింది. ఏ బ్యాటర్ క్రీజులో సౌకర్యవంతంగా కదలలేకపోయారు. ఉమ్రాన్ స్థానంలో టీమ్‌లోకి వచ్చిన చాహల్.. తన తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫిన్ అలెన్‌ను వెనక్కి పంపాడు. ఆ ఓవర్‌ను మెయిడెన్ విసిరి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో పాండ్య చాకచక్యంగా వ్యవహరించాడు. స్పిన్నర్లను చక్కగా ఉపయోగించుకుంటూ వికెట్లు రాబట్టాడు. శాంట్నర్ 19 పరుగులతో ఆ జట్టుకు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 2 వికెట్లు తీయగా.. పాండ్య, సుందర్, చాహల్, హుడా, కుల్దీప్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇక ఛేదనలో భారత బ్యాటర్లు సైతం తడబడ్డారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. శుభ్‌మన్ గిల్ 11 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 19, రాహుల్ త్రిపాఠి 18 బంతుల్లో 13 పరుగులు చేసి వెనుదిరిగారు. సూర్య కుమార్ యాదవ్ (31 బంతుల్లో 26), హార్దిక్ పాండ్య (20 బంతుల్లో 15) చివరి వరకు నిలిచి భారత్‌ను గెలిపించారు.