లార్డ్స్ టెస్టు రెండో రోజు తొలి సెషన్లోనే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది టీమ్ ఇండియా.
రెండో రోజు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది కోహ్లీసేన. తొలి ఓవర్లోనే రాబిన్సన్ వేసిన రెండో బంతికి సిబ్లే చేతికి చిక్కాడు సెంచరీ హీరో రాహుల్(129). మరుసటి ఓవర్ తొలి బంతికి.. అండర్సన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు రహానె(1).
ఆ తర్వాత పంత్ దూకుడు పెంచాడు. బౌలర్లను గౌరవిస్తూనే.. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించాడు. 37 పరుగులు చేసిన తర్వాత.. మార్క్ వుడ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.