మహేంద్ర సింగ్ ధోనీతో తనను పోల్చవద్దని యువ వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ రిషభ్‌పంత్ అన్నాడు. ఆటగాడిగా ఈ విషయాన్ని తాను ఆలోచించదల్చుకోలేదని అన్నాడు. ధోనీ ఓ దిగ్గజం..ఆయనని చూసి నేర్చుకునే దశలోనే ఉన్నానని చెప్పాడు. ఆటను ఎలా మెరుగుపర్చుకోవాలో ప్రతీ విషయం మహీని అడిగి తెలుసుకుంటున్నాని తెలిపాడు.
"ధోనీతో నన్ను పోల్చొద్దు"
"ఆట మెరుగుపరుచుకునేందుకు నేను ప్రతీ విషయం ధోనీని అడిగి తెలుసుకుంటున్నాను. ఇంకా ఆయన దగ్గర నుంచి నేర్చుకునే దశలోనే ఉన్నాను" అని పంత్ చెప్పాడు.
ఆస్ట్రేలియా సిరీస్లోనాలుగో వన్డేలో వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్న రిషభ్ విమర్శలు ఎదుర్కున్నాడు. ముఖ్యంగా టర్నర్ స్టంపౌట్, క్యాచ్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో పంత్‌పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ధోనీ ఉండుంటే ఇలా జరిగేది కాదంటూ నెటిజన్లు స్పందించారు.
ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 2-3తేడాతో ఓడిపోయింది. ముఖ్యంగా నాలుగో వన్డేలో 358 పరగులు చేసి కూడా ప్రత్యర్థికి విజయాన్ని సమర్పించుకుంది. ఐదో వన్డేలోనూ బ్యాటింగ్ పిచ్‌పై 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడి విఫలమైంది.