భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు వేదిక మెల్బోర్న్కు తరలిస్తే.. స్టేడియంలో మరింత మంది ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉందని ఎంసీజీ అధ్యక్షుడు స్టువర్ట్ ఫాక్స్ చెప్పారు. మూడో టెస్టు సిడ్నీలోనే జరగడంపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది.
సిడ్నీలో కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉండటం వల్ల తమ రాష్ట్రానికి వచ్చేవారు తప్పనిసరిగా స్వీయనిర్బంధంలోకి వెళ్లాలని క్వీన్స్లాండ్ ఆంక్షలు విధించింది. సిడ్నీలో మూడో టెస్టు జరిగితే భారత ఆటగాళ్లకూ ఈ నిబంధన వర్తిస్తుంది.