తొలి టీ20లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న టీమ్ఇండియా.. రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. గత 19 నెలల కాలంలో ఆడిన తొమ్మిది టీ20ల్లో గెలవడం కోహ్లీసేనకు కలిసొచ్చే అంశం. మరోవైపు సొంతగడ్డపై సిరీస్ చేజార్చుకోవద్దని, రేసులో నిలవాలని ఆసీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సిడ్నీ వేదికగా మధ్యాహ్నం 1:40గంటలకు జరిగే రెండో టీ20 పోరు హోరాహోరీగా సాగనుంది.
కోహ్లీ చెలరేగితే..
కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చిన చాహల్ తొలి టీ20లో మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. జడేజా 23 బంతుల్లో సాధించిన 44 పరుగులు.. విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. ప్రస్తుతం జడేజా స్థానంలో శార్దుల్ ఠాకుర్‌ను తీసుకున్నారు. ఈ తరుణంలో కోహ్లీ బ్యాటింగ్ కీలకంగా మారనుంది.
బౌలింగ్‌లో నటరాజన్, చాహల్ చక్కగా రాణించారు. దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ తమ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు.
ప్రతీకారంపై కన్నేసిన ఆసీస్