అత్యధిక రిటర్న్ క్యాచ్‌లతో హర్భజన్ రికార్డు - spinner
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ హర్భజన్ సింగ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక రిటర్న్ క్యాచ్‌లు సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు.
భజ్జీ ఖాతాలో మరో రికార్డు
శనివారం చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లో మొయిన్ అలీని రిటర్న్ క్యాచ్ ద్వారా ఔట్ చేశాడు హర్భజన్ సింగ్. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్ అండ్ బౌల్డ్‌లు సాధించిన జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
- 11 క్యాచ్ అండ్ బౌల్డ్‌లతో భజ్జీ టాప్‌లో ఉన్నాడు. తరువాతి స్థానంలో డ్వేన్ బ్రేవో 10 క్యాచ్‌లతో ఉన్నాడు. ఈ జాబితాలో సునీల్ నరైన్ 7, పొలార్డ్ 6 తర్వాత స్థానాల్లో ఉన్నారు.
- ఆర్సీబీతో మ్యాచ్‌లో మూడు వికెట్లను హర్భజన్ తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లి, మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్‌ల వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర వహించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సైతం అందుకున్నాడు.