భారత్తో జరిగే సిరీస్లో ప్రతి ఫార్మాట్లో ఆడే తొలి మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా జట్టు 'బేర్ ఫుట్' సర్కిల్ చేస్తుందని ఆ జట్టు ఆటగాడు ప్యాట్ కమిన్స్ తెలిపాడు. 'బ్లాక్ లైవ్స్ మేటర్' ఉద్యమానికి మద్దతు తెలపడానికి ఈ విధంగా చేయనున్నట్లు చెప్పాడు. చెప్పులు, బూట్లు కాళ్లకు లేకుండా ఆటగాళ్లంతా వృత్తాకారంలో నిలబడి మౌనం పాటించడాన్నే బేర్ ఫుట్ సర్కిల్ ఫామ్ అంటారు.
'బ్లాక్ లైవ్స్ మేటర్'పై ఆస్ట్రేలియా జట్టు మౌనంగా ఉందని విండీస్ ఆటగాడు మైకేల్ హోల్డింగ్ చేసిన ఆరోపణలను గుర్తుచేసుకున్నాడు కమిన్స్. తాము జాతి వివక్షకు పూర్తి వ్యతిరేకమని చెప్పాడు. ఈ విషయంపై తాము ఆ సమయంలో పెద్దగా స్పందించలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు.
" జాతి వివక్షను వ్యతిరేకిస్తూ ఒక్కొక్కరు ఒక్కోలా తమ నిరసనలు తెలిపారు. కానీ, మేం జట్టుతో మూకుమ్మడిగా నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యాం. అందుకే భారత్తో జరిగే సిరీస్లో బేర్ ఫుట్ సర్కిల్ ఫామ్ చేయనున్నాం".