తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నేను టీమ్ఇండియా బ్యాటింగ్​ కోచ్​ను కాదు'

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో​ ఓడిపోయాక భారత అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆటగాళ్లు, కోచ్​పై తీవ్ర విమర్శలు చేశారు. కానీ మధ్యలో సంబంధం లేని ఓ వ్యక్తిని బ్యాటింగ్​ కోచ్​గా భావించి ధ్వజమెత్తాడు ఓ నెటిజన్.

By

Published : Dec 20, 2020, 5:38 PM IST

Australia vs India: Wasim Jaffer's Calm Response To Twitter User Who Thought He Was India's "Batting Coach" Is A Winner
'నేను టీమ్ఇండియా బ్యాటింగ్​ కోచ్​ను కాదు'

అడిలైడ్​లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాభవం పాలైన భారత జట్టుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, కోచ్​ను పలువురు నెటిజన్లు తిట్టిపోశారు. అయితే మధ్యలో భారత మాజీ ఆటగాడు, ఐపీఎల్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్ ప్రస్తుత బ్యాటింగ్​ కోచ్​ వసీం జాఫర్​ను భారత బ్యాటింగ్​ కోచ్​గా పొరబడ్డాడు ఓ నెటిజన్. అదే తడవుగా అతనిపై ట్విట్టర్​లో వ్యంగాస్త్రాలు సంధించాడు.

"బ్యాటింగ్​ కోచ్ మీమ్స్​ చేయడంలో నిమగ్నమై ఉంటే.. ఇంక బ్యాట్స్​మెన్​ నుంచి ఏం ఆశించగలం" అని మోహిత్​ అనే అభిమాని ట్విట్టర్​లో అసహనం వ్యక్తం చేశాడు. దానికి జాఫర్​ గతంలో చేసిన మీమ్స్​ను జతచేశాడు.

అయితే ఈ విమర్శలను కూల్​గా తీసుకున్న జాఫర్​.. అభిమాని పొరపాటును ప్రశాంతంగా సరిచేశాడు. "నేను బ్యాటింగ్​ కోచ్​ను కాదు మోహిత్"​ అంటూ అతనికి బదులిచ్చాడు. 2020 ఐపీఎల్​ సందర్భంగా జాఫర్..​ వరుసగా మీమ్స్​ చేస్తూ ట్విట్టర్​లో చురుకుగా ఉన్నాడు.

తొలి టెస్టులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో ఆసీస్​ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. నాలుగు మ్యాచుల సిరీస్​లో రెండోది డిసెంబర్​ 26న మెల్​బోర్న్​లో జరగనుంది. రెండో టెస్టు నుంచి భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అందుబాటులో ఉండనని ఇదివరకే స్పష్టం చేయగా.. తొలి మ్యాచ్​లో గాయపడిన పేసర్​ మహ్మద్​ షమీ కూడా జట్టుకు దూరమయ్యాడు.

ఇదీ చూడండి:'టీమ్ఇండియా ఈ మార్పులు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details