తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో వన్డే వరుణుడిదే.. భారత్‌కు కలిసిరాని సిరీస్​.. 1-0 ఆధిక్యంలో కివీస్ - ఇండియా కివీస్​ వన్డే

భారత్, కివీస్‌ మధ్య జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణమైంది. టాస్‌ ఓడిన టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో పలుసార్లు వర్షం ఆటంకం కల్పించడంతో ఆటను 29 ఓవర్లకు కుదించారు. అప్పటికీ వరుణుడు కనికరించకపోవడంతో.. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు

india newzealand second odi match abandoned
india newzealand second odi match abandoned

By

Published : Nov 27, 2022, 12:46 PM IST

IND Vs NZ ODI Match Abandoned: భారత్ న్యూజిలాండ్​ జట్ల మధ్య హామిల్టన్‌ వేదికగా రెండో వన్డే మ్యాచ్‌లో వరుణుడు విజయం సాధించాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచే అప్పుడప్పుడు పలకరిస్తూ వచ్చిన వర్షం.. భారత ఇన్నింగ్స్‌ 12.5 ఓవర్ల వద్ద భారీగా కురవడంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు తేల్చేశారు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆటను రద్దు చేసే సమయానికి భారత్‌ 12.5 ఓవర్లలో 89/1 స్కోరుతో నిలిచింది.

మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి వన్డేలో కివీస్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం (నవంబర్ 30) క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగే చివరి వన్డే కీలకం కానుంది. ఆ మ్యాచ్‌లో కివీస్‌ గెలిస్తే సిరీస్‌ ఆ దేశం సొంతమవుతుంది. భారత్ విజయం సాధిస్తే మాత్రం సిరీస్‌ 1-1తో సమమవుతుంది.

ABOUT THE AUTHOR

...view details