తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో టీ20లోనూ తేలిపోయిన భారత్- సిరీస్​ ఇంగ్లాండ్​దే - భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ 2023

Ind W vs Eng W 2nd T20 : ముంబయి వాంఖడే వేదికగా జరిగిన భారత్- ఇంగ్లాండ్ మహిళల రెండో టీ20లో టీమ్ఇండియా ఓడింది. ఈ పర్యటనలో వరుసగా రెండో విజయంతో ఇంగ్లాండ్ మహిళల జట్టు 2-0తో సిరీస్ దక్కించుకుంది.

ind w vs eng w 2nd t20
ind w vs eng w 2nd t20

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 9:38 PM IST

Updated : Dec 9, 2023, 10:45 PM IST

Ind W vs Eng W 2nd T20 :ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు ఓటమి చవిచూసింది. బ్యాటింగ్​లో ఘోరంగా విఫలమైన టీమ్ఇండియా, బౌలింగ్​లోనూ పెద్దగా ప్రభావం చూపకపోవడం వల్ల ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 80 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని, ఇంగ్లాండ్ 11.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్​ సింగ్, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. సైకా, పూజా తలో వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను ఇంగ్లాండ్ 2-0 తేడాతో దక్కించుకుంది.

స్పల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ మూడు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సోఫీయా డంక్లీ (9), డ్యానీ వ్యాట్‌ (0) వెంటవెటనే పెవిలియన్ చేరారు. వీరిద్దరిని రేణుకా సింగ్ ఒకే ఓవర్లో ఔట్ వెనక్కిపంపింది. అయినప్పటికీ ఇంగ్లాండ్ బెదరలేదు. వన్​ డౌన్​లో వచ్చిన అలిల్ కాప్సీ (25 పరుగులు), నాట్​ సీవర్ (16 పరుగులు)తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. ఇక 8 ఓవర్లో సీవర్​ను పూజ వస్త్రకార్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ వెంటనే ఇంగ్లాండ్ మరో 3 వికెట్లు కోల్పోయింది. కానీ, అప్పటికే ఇంగ్లాండ్ విజయానికి చాలా దగ్గరైంది. చివర్లో సోఫీ (9*), నైట్ (7*) మిగిలిన పని పూర్తి చేశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా తడబడింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 16.2 ఓవర్లలో 80 పరుగులకే చేతులెత్తేసింది. జెమిమా రోడ్రిగ్స్ (30 పరుగులు) టాప్ స్కోరర్. ఆమె తప్పా మిగితా బ్యాటర్లెవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. ఓపెనర్ షఫాలీ వర్మ (0) డకౌట్​ కాగా, స్మృతి మంధాన (10) కూడా స్వల్ప స్కోర్​కే వెనుదిరిగింది. ఇక వరుసగా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (9), దీప్తి శర్మ (0), రిచా ఘోష్‌ (4), వస్త్రాకర్‌ (6), శ్రేయాంక పాటిల్ (4), టిటాస్ సాధు (2), సైకా ఇషాక్ (8) పెవిలియన్​కు క్యూ కట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షార్లెట్ డీన్, లారెన్ బెల్, ఎకిల్‌స్టోన్, సారా గ్లెన్ తలో రెండు, నాట్‌సీవర్, ఫ్రెయా కెంప్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

WPL 2024 కప్పు మాదే!- అభిమానుల ఆనందమే మా లక్ష్యం : RCB కెప్టెన్ స్మృతి మంధాన

తొలి టీ20 ఇంగ్లాండ్​దే - పోరాడి ఓడిన టీమ్ఇండియా

Last Updated : Dec 9, 2023, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details