IND VS WI third ODI: వెస్డిండీస్‌తో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టీమ్ఇండియా బ్యాటర్లు బాగా ఆడారు. శ్రేయస్ అయ్యర్(80), పంత్(56) ఇన్నింగ్స్ తోడవ్వడం వల్ల ప్రత్యర్థి జట్టు ముందు 266 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీపక్ చాహర్(38), వాషింగ్టన్ సుందర్(33) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా వారు విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 4, అల్జారీ జోసెఫ్ 2, హెడెన్ వాష్ 2, మిగతా వారు తలో వికెట్ దక్కించుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. అల్జెరీ జోసెఫ్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి ఓపెనర్, కెప్టెన్ రోహిత్‌శర్మ(13) బౌల్డ్ అవ్వగా తర్వాత ఐదో బంతికి వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లీ(0) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 4 ఓవర్లకే 16/2తో కష్టాల్లో పడింది.