IND VS WI third ODI: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయం సాధించింది టీమ్‌ఇండియా. 96పరుగులు తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3-0తేడాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. జట్టు సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది.
266 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్‌ను టీమ్‌ఇండియా బౌలర్ల చెమటలు పట్టించారు. వారిని ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టు 37.1 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు షాయ్ హోప్(5)- బ్రాండన్ కింగ్(14), డారెన్ బ్రావో(19), షామార్హ్ బ్రూక్స్(0) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్(34) పర్వాలేదనిపించాడు. చివర్లో వచ్చిన ఒడియన్ స్మిత్(36), అల్జారీ జోసెఫ్(29), హేడెన్ వాష్(13) కాసేపు మన బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. టీమ్‌ఇండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, ప్రసిద్ధ కృష్ణ 3, కుల్దీప్ యాదవ్ 2, దీపక్ చాహర్ 2 వికెట్లను దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా బ్యాటర్లు బాగా ఆడారు. అయితే మన జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. అల్జెరీ జోసెఫ్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి ఓపెనర్, కెప్టెన్ రోహిత్‌శర్మ(13) బౌల్డ్ అవ్వగా తర్వాత ఐదో బంతికి వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లీ(0) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 4 ఓవర్లకే 16/2తో కష్టాల్లో పడింది.