తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS WI: భారత్​-వెస్టిండీస్​ వన్డే సిరీస్​ వాయిదా? - టీమ్​ఇండియా కరోనా

IND VS WI ODI Series Postpone: ఆటగాళ్లు కరోనా బారిన పడటం వల్ల వన్డే సిరీస్​ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జట్టులో మరిన్ని పాజిటివ్​ కేసులు బయటపడితే సిరీస్​ను వాయిదా వేయాలని బోర్డు యోచిస్తున్నట్లు తెలిసింది.

IND VS WI ODI Series Postpone
భారత్​-వెస్టిండీస్​ వన్డే సిరీస్​ వాయిదా

By

Published : Feb 3, 2022, 12:19 PM IST

IND VS WI ODI Series Postpone: ఈ ఏడాది తొలి సీరీస్​ వేటను స్వదేశంలో మొదలుపెట్టనున్న భారత్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్​ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 6న జరగనున్న తొలి మ్యాచ్​ రెండు మూడు రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉందని క్రికెట్​ వర్గాలు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. కాగా, ఇప్పటికే ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్​ సెషన్​ను కూడా రద్దు చేశారు. తాజాగా కీలక ఆటగాళ్లైన శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​, రుతురాజ్​ గైక్వాడ్​, స్టాండ్​బై ఫాస్ట్​ బౌలర్​ నవదీప్​ సైనీ సహా పలువురు సహాయక సిబ్బంది కరోనా బారిన పడటమే ఇందుకు కారణం. అయితే జట్టు యాజమాన్యం మయాంక్​ అగర్వాల్​ను ఎంపిక చేయడం గమనార్హం.

"ప్రస్తుతానికి షెడ్యూల్​ ప్రకారమే సిరీస్​ జరుగుతుంది. జట్టులో మరిన్ని పాటిజివ్​ కేసులు బయటపడితే రెండు మూడు రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉంది" అని సదరు ప్రతినిధి పేర్కొన్నారు.

కాగా, హోటల్‌లోనే తమకు కేటాయించిన గదుల్లో ఐసోలేషన్‌లో ఉన్నారు వైరస్​ బారిన ఆటగాళ్లు సహా ఇతర సహాయక సిబ్బంది. వీరిని బీసీసీఐ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే రోహిత్‌ శర్మ ఇటీవలే గాయం నుంచి కోలుకోవడంతో తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. దీంతో ఓపెనర్లుగా రోహిత్‌తో.. మయాంక్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. కాగా, ఈనెల 6, 9, 11 తేదీల్లో మూడు వన్డేలు జరగాల్సి ఉండగా 16, 18, 20 తేదీల్లో మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది.

ఇదీ చూడండి:అది సాధించాలనేదే నా లక్ష్యం: తెలుగు తేజం అర్జున్​

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details