IND vs WI team squad 2023 : ఈ ఏడాది ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేసి జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్.. టెస్ట్ అరంగేట్రం చేయబోతున్నాడు. మరి కొన్ని గంటల్లో వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న మొదటి టెస్టులో అతడు ఓపెనర్‌గా దిగబోతున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దీంతో హిట్‌మ్యాన్-యశస్వి కలిసి ఓపెనర్లుగా బరిలో దిగబోతున్నారు. డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న యశస్వికి.. అప్పుడు ఆడే ఛాన్స్ దక్కలేదు. కానీ ఈ సారి విండీస్ పర్యటనకు ఎంపికవ్వడంతో పాటు మొదటి టెస్టులోనే ఆడే అవకాశం దక్కించుకోవడం విశేషం.
ఇకపోతే 2021లో ఆస్ట్రేలియాపై టెస్ట్ అరంగేట్రం చేసిన శుభమన్ గిల్.. అప్పటి నుంచి ఓపెనర్‌గానే బరిలో దిగుతున్నాడు. అయితే ఈ సారి యశస్వి ఓపెనర్‌గా ఎంట్రీ ఇవ్వడంతో.. గిల్ మూడో స్థానంలో ఆడనున్నట్లు హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారాను.. ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం వల్ల అతడి స్థానంలోనే గిల్‌ను బ్యాటింగ్‌కు దింపుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్నట్లు రోహిత్ చెప్పాడు.
జైశ్వాల్‌ను ఓపెనింగ్‌కు దింపడం వల్ల.. మునపటిలాగే లెఫ్ట్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్‌తో టీమ్ఇండియా ముందుకెళ్లనుందని రోహిత్ అన్నాడు. ఈ బ్యాటింగ్ ఆర్డర్ గురించి రోహిత్ మాట్లాడుతూ.. "గిల్ స్వయంగా తానంట తానే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని చెప్పాడు. కోచ్ రాహుల్ భాయ్ దగ్గరికి వెళ్లి ఈ స్థానంలో ఆడతానని రిక్వెస్ట్ చేశాడు. ఈ స్థానంలో అతడు మరింత మెరుగ్గా ఆడగలనని, జట్టుకు బాగా సహకరించగలనని చెప్పాడు. ఏదేమైనప్పటికీ ఓపెనింగ్ లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉండటం మంచి విషయం. ఈ కాంబినేషన్ లాంగ్ టెర్మ్‌కు మంచి పరిష్కారం అవ్వాలని ఆశిస్తున్నాను. జైశ్వాల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడని భావిస్తున్నాను." అని పేర్కొన్నాడు. కాగా, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో సెంచరీలతో పాటు ఐపీఎల్ 2023లోనూ యశస్వి అద్భుత పామ్ కనబరిచాడు. ఈ సీజన్లో అతడు 625 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడికి ఈసారి జట్టులో చోటు దక్కింది.
వికెట్ కీపర్ ఎవరో?.. వికెట్ కీపర్ స్థానంలో ఇషాన్ కిషన్-కేఎస్ భరత్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇషాన్ కిషాన్‌కు అవకాశమొస్తే.. ఇదే అతడికి తొలి టెస్టు అవుతుంది. ఇక 5 టెస్టు మ్యాచుల్లో ఆడియన ఆంధ్ర ప్లేయర్ కేఎస్ భరత్.. 8 ఇన్నింగ్స్‌ల్లో 129 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడు వికెట్ల వెనుకాల చురుగ్గానే రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించే ఛాన్స్ ఉంది కాబట్టి వికెట్ కీపింగ్‌లో ఉన్న టాలెంట్ దృష్ట్యా భరత్‌నే ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.