తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs WI: 'గేమ్​లో టాస్​ కీలక పాత్ర పోషించింది'

IND vs WI: విండీస్​తో జరిగిన తొలి వన్డేలో భారత్​ ఘన విజయం సాధించింది. ఈ విజయం వెనుక ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు టాస్​ కీలక పాత్ర పోషిందన్నాడు కెప్టెన్ రోహిత్​ శర్మ. గేమ్​లో పర్ఫెక్ట్​ అంటూ ఏదీ ఉండదన్నాడు.

IND vs WI
విండీస్​ టీమ్​ఇండియా

By

Published : Feb 6, 2022, 11:06 PM IST

IND vs WI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ 176 పరుగులకే ఆలౌట్‌ కాగా.. టీమ్‌ఇండియా 28 ఓవర్లలోనే నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 178 పరుగులు చేసి గెలుపొందింది. మ్యాచ్‌ అనంతరం టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ, వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరన్ పొలార్డ్, ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ చాహల్‌ మాట్లాడారు.

రోహిత్ శర్మ: గేమ్‌లో పర్ఫెక్ట్‌ అంటూ ఏదీ ఉండదు. ఎవరూ పరిపూర్ణంగా ఉండలేరు. మేం ఇంకా మెరుగు కావాలని కోరుకుంటున్నాం. అయితే ప్రతి ఆటగాడి నుంచి అద్భుతమైన ప్రయత్నం వచ్చిందనే చెప్పాలి. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ రాణించడం సంతోషంగా ఉంది. బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి కలిగించగలిగాం. చివరికి మేం అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాం. అహ్మదాబాద్‌లో చాలా మంచి నెట్ సెషన్‌ జరిగింది. పిచ్‌ చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇటువంటి గేమ్‌లో కచ్చితంగా టాస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మేం టాస్‌ గురించి పెద్దగా పట్టించుకోలేదు. దాని మీద ఆధారపడకుండా ప్రయత్నించాం.

పొలార్డ్‌: మ్యాచ్‌లో 22 ఓవర్లతో ఓడిపోవడం ఘోర పరాభవం కిందకే వస్తుంది. కనీసం 50 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేయలేకపోయాం. అది మాత్రం పెద్ద షాక్‌. నాతో సహా ప్రతి ఒక్కరూ టెక్నిక్‌పరంగా ఇంప్రూవ్ కావాల్సిందే. అయితే బౌలింగ్‌లో భారత్‌వి నాలుగు వికెట్ల పడగొట్టి బౌలర్లు కాస్త పట్టు తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఇంకొంచెం రన్స్‌ ఉంటే మాత్రం పోటీనిచ్చేవాళ్లం. టాస్ కీలక పాత్ర పోషించింది. సమయం గడిచే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలించింది. క్రికెట్ స్వభావం అలానే ఉంటుంది. దానిని మార్చలేం. హోల్డర్‌ అద్భుతంగా ఆడాడు. గత సంవత్సరం పెద్ద రాణించకపోయినా.. హోల్డర్‌ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగలిగే సమర్థుడు. ఇక మా టెక్నిక్స్‌ మీద దృష్టిసారించి వచ్చే మ్యాచుల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తాం.

చాహల్ (4/49): 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఒకే ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్‌ రెండు వికెట్లు పడగొట్టడం వల్ల ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగింది. నా వంతుగా అదే ఒత్తిడిని వారిపై కొనసాగేలా చేశాను. సుందర్‌ బౌలింగ్‌ పరిశీలించాక రోహిత్, కోహ్లీ నాకు చెప్పారు. అది సఫలమైంది. గత దక్షిణాఫ్రికా సిరీస్‌ ఫుటేజీని చూస్తే ఎక్కడ మెరుగు పడాలో తెలిసింది.

ఇదీ చూడండి :కోహ్లీ మాస్టర్​ ప్లాన్​.. దెబ్బకు పొలార్డ్​ డకౌట్​!

ABOUT THE AUTHOR

...view details