తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind vs Wi 4th T20 : ఆ రికార్డును సమం చేసిన గిల్ - జైశ్వాల్ జోడీ.. ఫ్లోరిడాలో హార్దిక్ సేనకు సూపర్ సపోర్ట్​ - india highest opening partnership in t20

Ind vs Wi 4th T20 : ఫ్లోరిడాలో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్​తో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్లు అదరగొట్టారు. దీంతో వారు ఫామ్​లోకి రావడం సంతోషంగా ఉందన్నాడు కెప్టెన్ హార్దిక్ పాండ్య. మ్యాచ్​ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన హార్దిక్​ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Ind vs Wi 4th T20
భారత్ వర్సెస్ విండీస్ టీ20

By

Published : Aug 13, 2023, 11:08 AM IST

Ind vs Wi 4th T20 : విండీస్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో రెండు ఓటముల తర్వాత భారత్ అద్భుతంగా పుంజుకుంది. నాలుగో టీ20లో అయితే ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించి.. జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో తాజాగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ గెలుపు​పై టీమ్ఇండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య, స్టార్​ ప్లేయర్​ యశస్వి జైశ్వాల్ సంతోషం వ్యక్తపరిచారు. మరోవైపు చివరి మ్యాచ్​లో తప్పకుండా వేగాన్ని పుంజుకొని సిరీస్ చేజిక్కించుకంటాం అని విండీస్ కెప్టెన్ రోవ్​మన్ పావెల్ అన్నాడు.

Gill Jaiswal Partnership : ఈ మ్యాచ్​లో యంగ్ ఓపెనర్లు శుభ్​మన్ గిల్, యశస్వి జైశ్వాస్ తొలి వికెట్​కు 165 పరుగులు జోడించారు. ఈ క్రమంలో టీ20ల్లో భారత్​ తరఫున అత్యధిక మొదటి వికెట్ భాగస్వామం నెలకొల్పిన రోహిత్ - రాహుల్ సరసన, గిల్ జైశ్వాల్ నిలిచారు.

Team India T20 Highest First Wicket Partnerships :

  • 165 పరుగులు - రోహిత్ - రాహుల్ vs శ్రీలంక, 2017
  • 165 పరుగులు - గిల్ - జైశ్వాల్ vs వెస్టిండీస్​, 2023
  • 160 పరుగులు - రోహిత్ - ధావన్ vs ఐర్లాండ్, 2018
  • 158 పరుగులు - రోహిత్ - ధావన్ vs న్యూజిలాండ్, 2017
  • 140 పరుగులు - రోహిత్ - రాహుల్ vs అఫ్గానిస్థాన్, 2021

మ్యాచ్​ తర్వాత ప్రజెంటేషన్ సమయంలో హార్దిక్ మాట్లాడుతూ.." మొదటి రెండు మ్యాచ్​ల్లో మేం ఓడాం. తొలి గేమ్​లో అయితే మా తప్పిదాలే మాకు విజయాన్ని దూరం చేశాయి. ఆ మ్యాచ్​లో చివరి నాలుగు ఓవర్లలో మేము తడబడ్డాం. కానీ మూడు, నాలుగో మ్యాచ్​ భిన్నంగా ఆడాం. వాళ్లను వాళ్లు నిరూపించుకోవాల్సిందిగా మా యువ ఆటగాళ్లకు తెలిపాము. వాళ్లు ఆ సవాల్​ను స్వీకరించి బాధ్యతగా ఆడినందుకు ఆనందంగా ఉంది. గిల్, జైశ్వాల్ ఇంతటి ఎండలో కూడా అద్భతంగా పరుగులు సాధించారు. వారు మ్యాచ్ ముగించిన విధానం నచ్చింది. విండీస్ చివర్లో బాగా ఆడింది. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టి వారిని దెబ్బతీశాం. ఇక్కడ (ఫ్లోరిడాలో) టీమ్ఇండియాకు మంచి మద్దతు లభించింది" అని అన్నాడు.

"ఫ్లోరిడా పిచ్​ బ్యాటింగ్​కు అనుకూలమే. అయినా పరుగులు చేయడం కష్టంగా ఉంది. నాపైన నమ్మకంతో జట్టులో ఛాన్స్​ ఇచ్చిన మేనేజ్​మెంట్​, కెప్డెన్ హార్దిక్​కు థ్యాంక్స్. క్రీజులో ఉన్నప్పుడు పరిస్థితులకు తగ్గట్టు ఆడితే.. పరుగులు సులభంగా వస్తాయి. గిల్​, నేను పార్ట్​నర్​షిప్​ చేయండం ఆనందంగా ఉంది. మాకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు" అని జైశ్వాల్ అన్నాడు.

Ind Vs Wi 3rd T20 : తిలక్ హాఫ్ సెంచరీ అడ్డుకున్న హార్దిక్ పాండ్య!.. ఫ్యాన్స్​ ఫుల్​ ఫైర్​

Surya Kumar Yadav T20 Records : విండీస్​పై చెలరేగిన సూర్య.. దెబ్బకు ఆ ముగ్గురి రికార్డులు బ్రేక్​..

ABOUT THE AUTHOR

...view details