Shubman Gill World Record : వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమ్ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. వన్డే సిరీస్‌ను మాత్రం ఘనంగా ముగించాడు. టెస్టు సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 6, 10, 29(నాటౌట్) పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌ను కూడా సింగిల్ డిజిట్ స్కోరు(7)తోనే ఆరంభించిన గిల్‌పై విమర్శలు వచ్చాయి. రెండో వన్డేలో 34 పరుగులు సాధించినప్పటికీ జట్టు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన గిల్ మళ్లీ అభిమానులకు టార్గెట్ అయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడితో కూరుకున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో మాత్రం గిల్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.
పాక్ బ్యాటర్ ప్రపంచ రికార్డు బద్దలు
IND Vs WI 3rd ODI : బ్రియన్ లారా స్టేడియంలో మంగళవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో శుభమన్ గిల్.. 92 బంతులు ఆడి 11 ఫోర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో మెరిసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. తన అద్భుత ఇన్నింగ్స్‌తోపాటు సరికొత్త రికార్డును సృష్టించాడు. సెంచరీ మిస్ అయినా.. పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 27 వన్డే ఇన్నింగ్స్‌లో సగటు 62.48తో 1437 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు.